<strong>వైయస్ఆర్ జిల్లాః</strong> దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ జన్మదిన వేడుకలను వైయస్ఆర్ కడప జిల్లాలో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాజిపేట మండలం బి. కొత్తపల్లి గ్రామంలో వైయస్ విజయమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు. <br/><strong>అనంతపురం జిల్లాలో..</strong>అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిల ఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. అదే విధంగా తాడిపత్రి నియోజకవర్గంలో వైయస్ విజయమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను వైయస్ విజయమ్మ మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.