<strong>జూలై 8న వైయస్సార్సీపీ ప్లీనరీ </strong><strong>పార్టీపై ప్రజలకున్న విశ్వాసమే తమ ఆస్తి</strong><strong>వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి</strong>విశాఖపట్నం: జూలై 8న నిర్వహించే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలోగా జిల్లాస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సూచించినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న విశ్వాసమే తమ పార్టీ ఆస్తి అన్నారు. <br/>ఢిల్లీ పార్లమెంట్ నుంచి ఏపీ అసెంబ్లీ వరకూ ప్రజల పక్షాన ఆరేళ్లుగా నిలబడ్డామని విజయసాయిరెడ్డి చెప్పారు. గతేడాది నిర్వహించిన ప్లీనరీలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమంపై పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపకల్పన చేశారని, గత జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. పార్టీ తరఫున చేపడుతున్న పోరాటాలను సమీక్షించి, భవిష్యత్తులో తలపెట్టే కార్యక్రమాలకు వచ్చే ప్లీనరీలో చర్చిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.