వచ్చే నెల 2న మండల కేంద్రాల్లో ధర్నాలు

హైదరాబాద్) కరువు, తాగునీటి ఎద్దడి మీద ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వచ్చే నెల 2న అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు
జరగనున్నాయి. ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాల ఎదుట నిరసనలు జరపాలని నిర్ణయించినట్లు
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థ సారధి వెల్లడించారు. హైదరాబాద్ లోని పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష
నాయకులు వైఎస్ జగన్ స్వయంగా గుంటూరు జిల్లా మాచర్ల లో జరిగే నిరసన కార్యక్రమంలో
పాల్గొంటారు. రాష్ట్ర పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని చెప్పే చంద్రబాబు, ప్రజల కనీస
అవసరాలైన తాగునీటిని సరఫరా చేయకుండా వ్యవహరిస్తున్నారని పార్థసారధి మండిపడ్డారు.
ఇందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. 

Back to Top