ప్రత్యేక హోదా వద్దంటే ప్రజలు తరిమికొడతారు

ఢిల్లీ: ప్రత్యేక హోదా వద్దన్న నాయకులను ప్రజలు తరిమికొడతారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. ఢిల్లీ మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రాన్ని విభజించేందుకు వీలు లేదని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించారన్నారు. విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా బిక్ష కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.  ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు వస్తాయన్నారు. గ్రాంట్ల రూపంలో కేంద్రం చేసే సాయమన్నారు. కేంద్రం నిధుల్లో 30 శాతం ప్రత్యేక హోదా రాష్ట్రాలకే ఉందన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం హోదాను తాకట్టు పెట్టారన్నారు.  ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నారన్నారు. ప్రత్యేక హోదా వద్దనే వారు బయటకు రండి..ప్రజలు మిమ్మల్ని తరిమికొడుతుందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఒక్కటే ప్రజలకు సరైన న్యాయం చేయగలుగుతుందన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా సాధించేవరకు వైయస్‌ జగన్, ఆయన వెనుక ఉన్న లక్షలాది మంది వెనుకడుగు వేయరని చెప్పారు.
 
Back to Top