పుష్కర ఘాట్ లలో భక్తుల ఇబ్బందులు

గుంటూరు : కృష్ణా పుష్కరాల సందర్భంగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం  సీతానగరం ఘాట్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి పారిశుద్ద్యం దారుణంగా ఉందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, పుష్కర పనుల్లో నాణ్యత లేదని ఆర్కే విమర్శించారు. రేపటి నుంచైనా ప్రభుత్వం భక్తుల ఇబ్బందులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కాగా కృష్ణా పుష్కరాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. పుష్కర ఘాట్  ల వద్ద సరైన వసతులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top