వైయ‌స్ఆర్‌సీపీతోనే అభివృద్ది

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని ఎమ్మెల్యే నారాయ‌ణ స్వామి ఉద్ఘాటించారు. వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే డ్వాక్రారుణమాఫీ పూర్తిగా మాఫీ చేస్తారని తెలిపారు. ఇంటికి విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అర్హులందరికి ఇంటి నివేశనా స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించే కార్యక్రమం చేపడతామన్నారు. ఎమ్మెల్యేలకు సైతం అదికారాలు తీసేసి చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రగతికరుణాకర్, జడ్పీటిసి గుణశేఖర్, అదికారప్రతినిది వేల్కూరుబాబురెడ్డి, పార్టీ మండలశాఖ అధ్యక్షులు సురేంద్రరెడ్డి,సింగిల్‌విండో ఉపాద్యక్షులు బాబునాయుడు, మాజీ ఎంపిటిసి రామచంద్రారెడ్డి, ఏకాంబరం, ప్రచారకార్యదర్శి హరికృష్ణారెడ్డి,సుబ్రమణ్యంరెడ్డి, రమేష్‌రెడ్డి, జయరామరెడ్డి,రూపేష్‌రెడ్డి,విప్‌. చంద్రమోహన్, మోసెస్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top