సీనియర్ సిటిజన్స్ విశ్రాంతి కోసం స్థలం కేటాయించండి

నెల్లూరుః పొదలకూరు రోడ్డులో సీనియర్ సిటిజన్స్ కు విశ్రాంతి షెల్టర్ కు స్థలం కేటాయించాలని వైయస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కమీషనర్ ను కోరారు. ఢిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలోని వివిధ ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సీనియర్ సిటిజన్స్ కోసం పద్మావతి సెంటర్ లోని జెడ్. పి. స్కూల్ మధ్యలో స్థలం కేటాయిస్తే, తానే సొంతంగా షెల్టర్ నిర్మిస్తానని కమిషనర్ ను కోరారు. స్పందించిన కమీషనర్ సాధ్యాసాధ్యాలు పరిశీలించి, రెండు రోజుల్లో తాను నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top