ఈసీకే నిర్ణయాధికారం ఇవ్వాలి

హైదరాబాద్) ఫిరాయింపు
ఎమ్మెల్యేలు లేక ఎంపీల మీద చర్యలు తీసుకొనే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలని
వైయస్సార్సీపీ మరోసారి డిమాండ్ చేసింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర
కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలోనే
తాము ఈ డిమాండ్ ను వినిపించామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రమంత్రి
వెంకయ్యనాయుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. అదే విషయాన్ని చట్టంలో
చేర్చితే మంచిదని, సభల్లో చెప్పి వదిలివేయటం వద్దని ఆయన సూచించారు. స్పీకర్ లు
సాధారణంగా అధికార పక్షానికి చెందిన వారై ఉంటారని, అటువంటప్పుడు ముఖ్యమంత్రి
స్థానంలో ఉన్నవారి చేతిలోనే ఉంటారని అభిప్రాయ పడ్డారు. అందుకే నిర్ణయాధికారాన్ని
స్పీకర్ కు కాకుండా ఎన్నికల సంఘానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా మీద
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని భూమన అన్నారు.

Back to Top