ధరల పెరుగుదల పాపం చంద్రబాబుదే..!

ఇటీవల కొంతమంది మాట్లాడుతూ ధరలు దేశమంతా పెరుగుతున్నాయని, ఉత్పత్తి తగ్గితే ఎవరు ఏం చేస్తారని, చంద్రబాబు చేతుల్లో ఏమీ ఉండదు..కేంద్రానిదో, మరొకరిదో లోపమని ప్రచారం చేస్తున్నారు. ఒక్క కందిపప్పు విషయం తీసుకొంటే మనకు  కనికట్టు బాగా అర్థం అవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమనటంలో చంద్రబాబు పాత్ర ఇదిగో..

1.       ఆంధ్రప్రదేశ్ లో కందిపప్పు వినియోగం ఏడాదికి సుమారు 3 లక్షల టన్నులు. ఇందులో మూడో వంతు అంటే  ఒక లక్ష లేదా మరో పాతిక వేలు అదనంగా మాత్రమే మన దగ్గర పండుతోంది. అంటే అధిక భాగం దిగుమతుల మీద ఆధారపడటమే. అంటే ఉత్పత్తి విషయం పెద్దగా ప్రభావితం చూపదు

2.       ఉత్పత్తి తగ్గిందన్న మాట కాసేపు అంగీకరిద్దాం. కానీ ఈ ఏడాది ఉత్పత్తిలో తగ్గుదల 9శాతం మాత్రమే అంటే.  అలా అయితే రేటు కూడా మహా అయితే 10 లేక 15శాతం మాత్రమే పెరగాలి. కానీ రేటు 150శాతం పెరిగింది

3.       దేశంలో ఫ్యూచర్ ట్రేడింగ్ బాగా పెరగుతోంది. ఇందులో నిత్యావసర వస్తువులు అయిన కందిపప్పు, మినప పప్పు ఉండటంతో క్రత్రిమంగా ధరలు ఒక్కోసారి భగ్గుమంటున్నాయి. వీటిని తప్పించాలన్న డిమాండ్ ఉంది. కానీ ఇప్పటి దాకా చంద్రబాబు ప్రభుత్వం  ఈ మేరకు కేంద్రాన్ని కోరనూలేదు. కనీసం లేఖ కూడా రాయలేదు.

4.       మరో వైపు ధరలు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తున్నప్పుడే తక్షణ చర్యలకు ఉపక్రమించాల్సింది. కానీ చంద్రబాబు ఆ సమయంలో అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లలో బిజీగా ఉండిపోయారు. సీఎం వెంట మంత్రులు, ఆ వెంట ఉన్నతాధికారులు ఉండిపోయి ధరల్ని ఆకాశానికి వదిలేశారు.

5.       ధరలు పెరిగేటప్పుడే పౌర సరఫరాల శాఖ జోక్యం చేసుకొని ఉంటే కొంత మేర అయినా సామాన్యులకు న్యాయం దక్కేది.

 6.       జిల్లాల్లో వర్తకలు ఎవరు, నల్ల బజారుకి సరుకుల్ని తరలించేది ఎవరు అన్నది గుర్తించాలంటే అధికారులతో టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేయాలి. అక్రమ నిల్వలు దాచిన గోడౌన్ లపై దాడి చేయాలి.

 (గతంలో ఇసుక మాఫియా ను అడ్డుకొన్నందుకు వనజాక్షి అనే మహిళా రెవిన్యూ అధికారిని తెలుగుదేశం ఎమ్మెల్యే నిస్సిగ్గుగా కొట్టిస్తే చంద్రబాబు సెటిల్ మెంట్ చేయించి నోరు మూయించారు. అటువంటప్పుడు అధికారులు టీడీపీ మాఫియా ఆగడాల్ని ఎలా ఆపగలుగుతారు)

7.       నల్ల బజారు కు తరలుతున్న అక్రమ నిల్వల విషయంలో కేంద్రం రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటించింది.

8.       చౌక ధరల దుకాణాలు, రైతు బజార్లలో సబ్సిడీ రేటుకి సరఫరా చేయించే ఏర్పాట్లు ఉండాల్సి ఉండగా, సమగ్రంగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.

9.       పైగా ఇప్పుడు వర్తకుల దగ్గరే రేటును రూ. 140 (హోల్ సేల్), రూ. 143(రిటైల్) గా స్థిరీకరించి అమ్మిస్తామని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.

10.   దళారీలే రేటును 70 నుంచి రూ. 200 కి పెంచితే, వాళ్లకే అవకాశం ఇచ్చి రూ.140 దగ్గర స్థిరీకరించామని చెప్పటం ఎంత వరకు సమంజసం.

కందిపప్పు విషయంలో చంద్రబాబు బండారం బయట పడింది కదా. మిగిలిన నిత్యావసర వస్తువుల

ధరలు భగ్గుమనటానికి కూడా కారణం ముమ్మాటికీ చంద్రబాబే..!


Back to Top