వైయ‌స్ జ‌గ‌న్ దీక్ష‌కు సీపీఎం మ‌ద్ద‌తు

క‌ర్నూలుః రైతుల కోసం ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు చేప‌డుతున్న రైతు దీక్ష‌కు వామ‌ప‌క్షాల నుంచి విశేష‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భ‌ర‌త్‌కుమార్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. క‌ర్నూలు జిల్లా పార్టీ కార్యాల‌యంలో సీఎంఐ నేత‌ల‌తో క‌లిసి ఆయ‌న విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రైతు మ‌ద్ద‌తు ధ‌ర కోసం వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరులో చేప‌ట్ట‌బోయే రైతు దీక్ష‌కు సీపీఐ పార్టీ నాయ‌కులు త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించార‌న్నారు. దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిసిన సీపీఐ నాయ‌కుల‌కు భ‌ర‌త్‌కుమార్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రంలోని రైతు సంఘాలు, ప్ర‌తిప‌క్ష పార్టీలు రైతు దీక్ష‌కు మ‌ద్ద‌తు ప‌లికి రైతు దీక్ష‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. ప్ర‌భుత్వ మెడ‌లు వంచి రైతుల పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర తీసుకొద్దామ‌ని పిలుపునిచ్చారు.

Back to Top