రాజ‌ధాని ముసుగులో అవినీతి.. ఎమ్మెల్యే ఆర్కే

విజయవాడ: రాజధాని ముసుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పరాకాష్టకు చేరిందని వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతి విషయంలో తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే చంద్రబాబు విదేశీ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Back to Top