నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డితోనే సాధ్యం

వైయ‌స్ఆర్ జిల్లా: రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితోనే సాధ్యమని గాలివీడు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడ‌ ఉమాపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని నూలివీడు పంచాయ‌తీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీలో చాలా వరకు రైతులకు ఈ సంవత్సరాన్నికి అందాల్సిన రుణమాఫీ కూడా బ్యాంక్‌లలో జమ కాలేదని, రైతులు రుణాలను రెన్యువల్‌ చేసుకోలేక రుణమాఫీ డబ్బులు కోసం ఎదురుచూస్తుంటే రైతుల గోడు వినకుండా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయకుండా మహానాడు పేరుతో సంబరాలు చేసుకొంటున్నారన్నారు. రైతుల సమస్యలు కనబడడం లేదా అని ప్రభుత్వ తీరుపై ఆయన ద్వజమెత్తారు. గ్రామీణా ప్రాంతాలలో ప్రజలు కరువుతో అల్లాడుతున్న సమయంలో ప్రజలకు, రైతాంగానికి అందాల్సిన ఏ ఒక్క సహాయం కూడా ప్రభుత్వం సహాయ పడలేదని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ప్రభుత్వంపైనా, అధికార పార్టీ నాయకులపైన దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. అమరావతి నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేసుకొంటూ విదేశాలను తిరుగుతూ రోజుకో మాట ప్రజలకు అపద్దాలు చెబుతూ పబ్భం గడుపుకొంటున్నారని ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఇది అక్షర సత్యంగా ప్రజల గుండెల్లో దాచుకొన్న తీపి కబురని ఆయన అన్నారు.

Back to Top