వైయస్‌ఆర్ సీపీ నాయకుని హత్యకు కుట్ర

దర్శి రూరల్ః మండలంలోని తూర్పు వెంకటాపురం గ్రామానికి చెందిన వైయస్‌ఆర్ సీపీ నాయకుడు మానికొండ వెంకయ్యను హ‌త్య చేసేందుకు కొంద‌రు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఎలాగైనా వెంక‌య్య‌ని అంతమొందించాలని అత‌ని ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి వున్న సపోర్టు తీగకు పైనుంచి కరెంట్ సప్లయ్ ఇస్తే ఏదో ఒక సమయంలో దాన్ని ముట్టుకుంటే చనిపోతాడని భావించి ఈ పని చేసి ఉంటారని గ్రామస్తులు చ‌ర్చించుకుంటున్నారు. ఉదయం విద్యుత్ లైన్‌మెన్ వ‌చ్చి దాన్ని పరిశీలించి ఇది ఎవరోగాని కావాలనే కరెంట్ వైరును సపోర్టు వైరుకు సప్లయ్ ఇచ్చారన్నారు. దీనిపై వెంకయ్య పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్సై యం సుబ్రహ్మణ్యం వచ్చి పరిశీలించారు. 

Back to Top