హక్కుల నేతకు నివాళి

హైదరాబాద్ : పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత బొజ‍్జా తారకం మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  బొజ్జా తారకం భౌతికకాయాన్ని వైయస్ జగన్ సందర్శించి, అంజలి ఘటించారు. 

కాగా సందర్శకుల కోసం బొజ్జా తారకం భౌతికకాయాన్ని సాయంత్రం మూడు గంటల వరకూ ఇక్కడే ఉంచుతారు. నాలుగు గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గత నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు.

తాజా ఫోటోలు

Back to Top