ఫాంహౌస్ నుంచి బయటకు రా

  • కేసీఆర్ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న మానుకో
  • విద్యార్థుల బ‌లిదానాల‌తో అధికారంలోకి వ‌చ్చి
  • అదే విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతావా
  • తెలంగాణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్‌

హైద‌రాబాద్‌:  ఎంసెట్ -2 పేప‌ర్ లీకేజీ దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని తెలంగాణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో ఆయన విలేక‌రుల‌తో మాట్లాడారు. విద్యార్థుల ఆత్మ బ‌లిదానాల‌తో అధికారంలో వ‌చ్చిన కేసీఆర్ ప్రభుత్వం... వారి జీవితాల‌తో చెల‌గాటం ఆడడం దారుణమని ఆయ‌న నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా కేసీఆర్  ఫాంహౌస్‌లో నుంచి నిద్ర‌లేచి సెక్ర‌టేరియ‌ట్‌కు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసానివ్వాలన్నారు.

మ‌రిన్ని విష‌యాలు ఆయన మాటల్లోనే...
కేంద్ర ప్ర‌భుత్వం ఎంసెట్‌పై అనేక ప్ర‌క‌ట‌న‌లు చేసి విద్యార్థుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తోంది.
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రైవేట్ యాజ‌మాన్యాల‌ను ప్రోత్స‌హిస్తూ విద్యార్థుల‌కు ద్రోహం చేస్తోంది
విద్యార్థుల ప్రాణ త్యాగంతో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వం... ఇప్పుడు అదే విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతుంది.
టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను చేప‌డుతుంది.
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేకంగా 8 యూనివర్సిటీల్లో నియ‌మించిన వైస్ ఛాన్స‌ల‌ర్‌ల‌ను... హైకోర్టు ర‌ద్దు చేసి కేసీఆర్ స‌ర్కార్‌ను చెంప‌దెబ్బ కొట్టింది
ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే ప్ర‌జ‌లు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డుతారు
ఇప్ప‌టికైనా కేసీఆర్ నిద్ర‌లోంచి మేల్కొని ప్ర‌జా కోరిక‌ల మేర‌కు ప‌ని చేయాలి
ఎంసెట్ -2 బాధిత విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు తెలంగాణ వైయ‌స్సార్సీపీ మద్దతుగా నిలుస్తుంది
ఎంసెట్ -2 పరీక్షా పత్రాలు లీకేజీ చేసిన సంబంధింత మంత్రి, అధికారుల‌ను క‌ఠినంగా శిక్షించాలి.
Back to Top