ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు దొర‌క‌ని సీఎం అపాయింట్‌మెంట్‌

గుంటూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు 15 రోజులుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ దొర‌క‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి సంబంధించిన నిధుల విష‌యంపై చ‌ర్చించేందుకు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు సీఎం అపాయింట్‌మెంట్ కోరగా ఎలాంటి స్పంద‌న లేదు. దీంతో శుక్రవారం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలవనున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి ఆయనను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.  నియోజక వర్గ నిధుల గురించే తామ అపాయింట్ మెంట్ అడుగుతున్నా చంద్రబాబు ఇవ్వడం లేదని పిన్నెల్లి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్తున్నట్టు పిన్నెల‍్లి వెల్లడించారు.

Back to Top