పోలీసుల తీరు మారాలి

పట్టణ పోలీసులు తమ పార్టీ శ్రేణుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్‌ ప్రతిపక్ష నాయకుడు నాయుడు వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు స్ధలం ఆక్రమణపై కమీషనర్‌ నామా కనకారావు తీరును వ్యతిరేకిస్తూ మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నాకు ఆదివారం పిలుపునిచ్చారు.సమాచారం అందుకున్న అర్బన్‌ ఎస్సైలు ఉమా మహేశ్వరరావు,కోటేశ్వరరావు,రూరల్‌ ఎస్సై ఉదయ్‌లు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని 9వ వార్డుకు చెందిన పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.దీంతో పోలీసులు,వైఎస్సార్‌సీపి నాయకుల వాగ్వాదం జరిగింది. ధర్నా చేయక ముందే ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కుని కాలరాయడం సరికాదన్నారు.అక్రమ కేసుల నేపథ్యంలో ..పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ ఆదేశాలతో ధర్నా ప్రయత్నాన్ని విరమించుకున్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు కాలేషా,నాగుల్‌ మీరా,అత్తులూరి షరీఫ్,కొమ్ము రాజేష్,గుంజి వీరాంజనేయులు పాల్గొన్నారు. 

Back to Top