చంద్రబాబు హామీలేమయ్యాయి..!

హైద‌రాబాద్‌: చంద్రబాబు ఏపీకి మకాం మార్చగానే పిడుగులు పడి 20 మంది చనిపోయారని తమ్మినేని సీతారాం అన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఫోన్ సంభాషణలో ఉన్నది చంద్రబాబు గొంతేనని తన కుమారునిపై ప్రమాణం చేస్తానని.. కాదని చంద్రబాబు లోకేష్ పై ప్రమాణం చేయగలరా అని  తమ్మినేని సవాల్ విసిరారు. ఏపీలో ఉన్న అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పేరు చెబుతున్న చంద్రబాబు ...ఈఏడాది ఒక్క రూపాయి కూడా రైతులకు కొత్తరుణాలు ఇవ్వలేదని లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండిపడ్డారు.
Back to Top