ఆడ‌వారంటే అంత అలుసా..!

న్యూఢిల్లీ ముఖ్య‌మంత్రి గా ఉన్న చంద్ర‌బాబు నాయుడు త‌న హోదాకు త‌గిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తించ‌టం లేదు. రాజ‌ధాని వీధుల్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. 

కోడ‌లే కొడుకుని కంటాను అంటే అత్త వద్దంటుందా..! అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అంటే కొడుకుని క‌న‌టం అన్న‌ది గొప్ప విష‌యంగానూ, కూతురుని క‌న‌టం అన్న‌ది విలువ లేని విష‌యంగానూ ఆయ‌న చెప్పిన తీరు మీద మ‌హిళా లోకం మండిపడుతోంది. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, ప్ర‌త్యేక ప్యాకేజీ కి సంబంధించిన వివరాలు చెబుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

ఆడ‌- మ‌గ మ‌ద్య వివ‌క్ష ఉండ‌రాదు, పిల్ల‌ల్ని క‌న‌టం విష‌యంలో ఇటువంటి అస‌లు కూడ‌ద‌న్నది లోక హితోక్తి. ఇందుకోసం క‌డుపులో బిడ్డ కూతురో, కొడుకో చెప్పే స్కానింగ్ ప‌రీక్ష‌ల్ని కేంద్రం నిషేధించింది. అటువంట‌ప్పుడు కొడుకుని క‌న‌టం అన్న‌ది గొప్ప విష‌యంగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌టంపై విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. దీన్ని బ‌ట్టి ఆయ‌న మ‌న‌స్త‌త్వం అర్థం అవుతోంద‌ని మ‌హిళా సంఘాలు అంటున్నాయి. 
Back to Top