రుణమాఫీలను పట్టించుకోకుండా చైనా, సింగపూర్ పర్యటనలా?

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కష్టాలను గాలికి వదిలేసిన బాబు.. తరుచూ విదేశాలకు వెళ్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలను పట్టించుకోకుండా చైనా, సింగపూర్ పర్యటనలకు వెళ్లడాన్ని చెవిరెడ్డి తప్పుబట్టారు.
 
రుణమాఫీ, డ్వాక్రా రుణాలను పట్టించుకోని బాబు.. చైనా, సింగపూర్ లకు వెళ్తే ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజలను కష్టాలు పక్కదోవ పట్టించడానికే బాబు విదేశీ పర్యటనలని ఎద్దేవా చేశారు. ఆంధ్రను సింగపూర్, చైనాలా చేస్తానంటూ చంద్రబాబు డాంబికాలు పలుకుతున్నారని విమర్శించారు.
Back to Top