చంద్రబాబు పాలన మోసాలు..అబద్దాలు..!

  • అవినీతి సొమ్ముతో
    ఎమ్మెల్యేలకు ప్రలోభాలు
  • రాజధాని ప్రాంతంలో
    బినామీల సాయంతో భూముల దందా
  • దళితుల్ని సైతం మోసం
    చేసిన ఘనత బాబుది
  • బినామీల కోసమే జోనలింగ్
    వ్యవస్థ
  • హైదరాబాద్: అవినీతి
    సొమ్ములతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, నిరంకుశ వైఖరితో చంద్రబాబు నాయుడు
    నిస్సిగ్గుగా అవినీతి సొమ్ముల్ని ప్రదర్శిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బుల్ని
    ఎరగా చూపుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
    మండిపడ్డారు. ప్రలోభాలు పెట్టి ఒక్కో ఎమ్మెల్యేకు సుమారు 20 నుంచి 30 కోట్ల
    రూపాయిలు ఎర చూపి ఆశలు చూపించి నిస్సిగ్గుగా లాక్కొంటున్న వైఖరికి నిరసన
    తెలుపుతున్నామని ఆయన వివరించారు. చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్
    నాయకత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రగా శాసనసభ కు
    తరలివచ్చారు. ఈ సందర్భంగా నిరసన యాత్ర ఉద్దేశ్యాలను వైఎస్ జగన్ మీడియాకు
    వివరించారు.

    ప్రతిపక్ష ఎమ్మెల్యేలను
    ప్రలోభ పరుచుకొంటున్నందుకు నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. రాజధాని అక్కడ
    పెడుతున్నాం..ఇక్కడ పెడుతున్నాం అంటూ నూజివీడు, నాగార్జున యూనివర్శిటీ ప్రాంతాలపై
    ప్రచారాలు చేశారని వైఎస్ జగన్ చెప్పారు. ఈ లోగా తమ బినామీలు రైతుల్ని మోసం చేసి
    భూములు కొనేసుకొన్నాక అమరావతి ప్రాంతంలో రాజదానిని ప్రకటించారని వివరించారు. ఈ
    విధంగా తప్పు దోవ పట్టించి రైతుల్ని మోసం చేసినందుకు నిరసన తెలుపుతున్నామని
    చెప్పారు. ఆఖరికి దళితుల్ని సైతం వదలకుండా వాళ్ల భూముల్ని లాక్కొన్నందుకు నిరసన
    తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. బినామీల లాభం కోసమే జోనలింగ్ వ్యవస్థను ఏర్పాటు
    చేశారని... తమ బినామీల భూములకు ఎక్కువ ధరలు వచ్చేట్లుగానూ, మిగిలిన వారి భూములకు
    పెద్దగా ధర రాకుండానూ వ్యూహంపన్ని జోనలింగ్ వ్యవస్థ ను ఏర్పాటు చేసినందుకు నిరసన
    తెలుపుతున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చేస్తున్న మోసాలు,
    చెబుతున్న అబద్దాలకు నిరసన గా, ఎన్నికలకు ముందు చెప్పిన అబద్దాలు, అమలు పరచని
    హామీల వైఖరికి నిరసనగా ఈ యాత్ర చేపడుతున్నట్లు వైఎస్ జగన్ వివరించారు. 


Back to Top