బాబు రియలెస్టేట్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయాలిచంద్రబాబు అవినీతిని ఐవైఆర్ బయటపెట్టారుదోపిడీ జరుగుతుందనే వైయస్‌ఆర్ సీపీ వాదన నిజమైందిఐవైఆర్ మాటలకంటే ఇంకేం రుజువు కావాలిరైతులకిచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా..?ప్రైవేట్ సంస్థలకు రాజధాని భూములను అమ్ముకుంటున్నాడుక్యాట్ కేసులో నిందితుడిని సీఆర్‌డీఏ చైర్మన్‌గా నియమించారు రాజధానిలో చేసిన అభివృద్ధిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిహైదరాబాద్: రాజధాని నిర్మాణం ముసుగులో చంద్రబాబు చేస్తున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు చేసేందంతా అవినీతి అని ప్రస్తావించడం జరిగిందని, రాజధానికి సంబంధించిన వాస్తవాలన్నీ ఆయన బయటపెట్టారన్నారు. రాజధాని శంకుస్థాపనకు దేశంలోని అన్ని నదులు, పుణ్యక్షేత్రాల నుంచి నీటిని, మట్టిని తీసుకొచ్చి, ప్రధానమంత్రి మోడీని, హోంమంత్రి అరుణ్‌జైట్లీని పిలిచి దేశంలోనే భారీ స్థాయి రాజధానిని కడుతున్నానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే శంకుస్థాపన చేసిన చోటంతా అధ్వానంగా తయారైందని ఫోటోలతో సహా మీడియా ముందు చూపించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అవినీతి పరిపాలనపై ఆర్కే మండిపడ్డారు.
బాబు అవినీతిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి..చంద్రబాబు రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని వైయస్సార్సీపీ మొదటి నుంచి చెబుతుందని, ఇప్పుడు ఐవైఆర్ మాటల ద్వారా రుజువైందన్నారు. శివరామకృష్ణ కమిటీ రాజధానికి అమరావతి ప్రాంతం సరైంది కాదని చెప్పింది వాస్తవం అని, కమిటీలో కన్వీనర్‌గా వ్యవహరించిన ఐవైఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి అధిపతి ముఖ్యమంత్రి అయితే మరోవైపు బ్యూరోక్రసీగా పరిపాలన పరంగా అధిపతి చీఫ్ సెక్రటరీ అని, ప్రభుత్వం ఏ ఒక్క చిన్న నిర్ణయం సెక్రటరీకి తెలుస్తుందన్నారు. అయితే చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ చంద్రబాబుది కలల రాజధాని కాదు.. రాజధాని పేరుతో మభ్యపెడుతూ అంతులేని అవినీతికి తెరతీశారని చెప్పారన్నారు. ఐవైఆర్ మాటలకన్నా రుజువులు ఏం కావాలని, చంద్రబాబు అవినీతిపై వెంటనే సీబీఐ, న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు.
తొమ్మిది నగరాల అడ్రస్ ఎక్కడ బాబూ?రాజధానిలో తొమ్మది నగరాలు నిర్మిస్తామని చంద్రబాబు చెప్పాడని, అవి ఇప్పటి వరకు ఎక్కడున్నాయో అడ్రస్ కూడా లేదని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు. గతంలో స్విస్ చాలెంజ్ పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాజధానిని అమ్మేస్తాననే విధంగా సీఎం వ్యవహరించాడన్నారు. రాజధానిలో ప్రైవేట్ సంస్థలకు భూములు ఇవ్వాలని చట్టాల్లో లేకున్నా.. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల వద్ద నుంచి లాక్కున్న 33 వేల ఎకరాల భూమిలో ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థలకు ఇష్టారీతిలో ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడన్నారు. రైతులు రత్నాలు పండించే భూమిని బెదిరించి, భయపెట్టి, పంటలు తగలబెట్టించి, పోలీసులతో కొట్టించి మరీ చంద్రబాబు లాక్కున్నాడని విమర్శించారు. భూమి కోల్పొయిన రైతులకు ఇచ్చిన వాగ్ధనాలు ఇప్పటి వరకు ఒక్కటి నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు.
వైయస్‌ఆర్ హయాంలో ఏ ఉద్యోగి తప్పు నిర్ణయం అని చెప్పలేదు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో చిన్న స్థాయి సామాన్య ఉద్యోగి కూడా ఏ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పిన దాఖలాలు లేవని ఆర్కే గుర్తు చేశారు. 2018 నాటికి మొదటి దశ రాజదానిని చూపిస్తానన్న చంద్రబాబు తీరుకు ఈ ఫోటోలే సాక్షాధారాలన్నారు. రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయి డిజైన్లు కూడా చంద్రబాబు చేయలేకపోయాడన్నారు. రూ.10 వేలు చదరపు అడుగు నిర్మాణానికి ఇచ్చి చిన్నపాటి వర్షానికే తడిసిపోయే టెంపరరీ భవనాలు మాత్రమే కట్టాడని మండిపడ్డారు. గతంలో సీఆర్డీఏ చైర్మన్‌గా పనిచేసిన నాగులపాటి శ్రీకాంత్ అనే వ్యక్తి నిజాయితీగా పనిచేస్తున్నాడని విధుల నుంచి తప్పించారని గుర్తు చేశారు. క్యాట్ కేసులో నిందితుడిని తీసుకొచ్చి సీఆర్‌డీఏ చైర్మన్‌గా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో ప్రజాధనాన్ని, భూములను దోచుకుంటూ నేను బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నానని చెప్పుకుంటున్నారన్నారు.
బాబు వ్యవస్థలను ఎంతలా మ్యానేజ్ చేయగలడో అర్థం అవుతుందివినాయక నిమజ్జనానికే నీళ్లు లేవని ప్రజలు మొత్తుకుంటుంటే జలహారతి అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆర్కే మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి పరిపాలన చేస్తున్నారో ప్రజలంతా గమనించాలన్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ మాటలను బట్టి సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని, చంద్రబాబు రాజధానిలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైయస్‌ఆర్ మరణాంతరం వైయస్ జగన్ ఎక్కడ సీఎం అవుతారోనని కాంగ్రెస్‌తో కుమ్మకై అక్రమంగా చంద్రబాబు కేసులు పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు ఎంతలా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తాడో అర్థం అవుతుందన్నారు.