ముఖ్యమంత్రి చట్టానికి అతీతుడా?

అడ్డంగా దొరికిపోయినా బుకాయింపులా...
నాకూ ఏసీబీ ఉందంటూ బెదిరింపులేమిటి?
బాబు నీతిమంతుడైతే విచారణకు ఎందుకు వెరపు?
 
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన ఓ వ్యక్తి చట్టానికి అతీతుడు కాదు.  అరెస్టుకు అతీతుడు కాడు. రేవంత్రెడ్డి ముడుపుల వ్యవహారంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడిని తక్షణం సీఎం పదవినుంచి దింపాలి. ఏపీలో దోపిడీ రాజ్కు ముగింపు పలకాలి. చంద్రబాబు నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. అయితే చంద్రబాబు వ్యవహారశైలి చాలా భిన్నంగా ఉంది. ముడుపుల ఉదంతంలో అడ్డంగా అన్ని సాక్ష్యాలతో దొరికి పోయినా ఆయన బింకంగా బెదిరింపులకు దిగుతున్నారు. కిందపడ్డా తనదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తనకూ ఏసీబీ ఉందంటూ బెదిరిస్తున్నారు. అంటే తాను దొరికిపోయాడు కాబట్టి బెదిరించి బయటపడదామనుకుంటున్నారా? తాను చెప్పుకుంటున్నట్లు చంద్రబాబు నిప్పులాంటి మనిషే అయితే విచారణకు ఎందుకు సిద్ధపడడం లేదు? నిజాయితీ నిరూపించుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఆరోపణలు వచ్చినపుడు ఆ పదవికి రాజీనామా చేసి విచారణ సజావుగా జరగడానికి అవకాశమివ్వడం నీతిమంతుల లక్షణం. అది వారి బాధ్యత కూడా. కానీ చంద్రబాబు వ్యవహార శైలి మాత్రం అన్నిటికీ భిన్నం....
  • విజయవాడ సంకల్ప దీక్షలో కూడా చంద్రబాబు నాయుడు తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే తాను తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో సంభాషణ జరిపానని ఒప్పుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే రేవంత్రెడ్డి వెనక ఉన్నది తానేనని చెప్పినట్టు అయింది. 
  • రేవంత్రెడ్డి ఎవరి తరఫున, ఎవరి డబ్బుతో, ఎవరి కోసం ఈ పని చేశాడు? బాబే ఈ పని చేయించాడని చంద్రబాబు నాయుడు సంభాషణతో  100కు 100 శాతం రూఢి అయింది. అయినా  చంద్రబాబు నాయడు సీఎం పదవిలో కొనసాగుతున్నాడంటే ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. 
  • రేవంత్ డబ్బు వ్యవహారానికి, తనకు ఏ సంబంధమూ లేదని చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏ ప్రకటనా చేయలేదు. ఆయన ఆర్గ్యుమెంట్ అంతా... నా ఫోన్నే ట్యాప్ చేస్తారా? వేరే రాష్ట్రం ఏసీబీ, వేరే రాష్ట్రం పోలీసుకు తన మీద విచారణ చేసే హక్కుందా... నేనూ సీఎంనే, నాకూ హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండే హక్కుంది... నాకూ ఏసీబీ ఉంది,,, నాకూ పోలీసులున్నారు...  నా రాష్ట్రంలో దొంగ కేసులు పెట్టిస్తా...  అనే గగ్గోలుకే పరిమితం అయింది. 
  • చంద్రబాబు నాయుడు నిజంగా నీతిమంతుడే అయితే ఏ విచారణకు అయినా తాను సిద్ధం అని ప్రకటించాలి. కోర్టులకు వెళ్ళి విచారణను నిలుపు చేసేందుకు ప్రయత్నించకూడదు. ఇందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారా?
  • భారత దేశంలో ఏ పొలిటీషియన్ కూడా ఇంత అడ్డంగా, రెడ్ హ్యాండెడ్గా చట్టానికి దొరికి పోయి కూడా... జాతీయ మీడియాలో తాను ఒక టాపిక్ కాకుండా మేనేజ్ చేసుకోలేడు. ఏ రాజకీయ వేత్త కూడా ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికి కూడా పదవిలో కొనసాగలేడు. చంద్రబాబు నాయుడు ఒక్క మీడియానే కాదు... ప్రతి వ్యవస్థనూ మేనేజ్ చేయటానికి 20 ఏళ్ళుగా అలవాటు పడ్డాడు కాబట్టే దొరికి కూడా బెదిరిస్తున్నాడు. 
  • ఈ వ్యవహారానికి, వైఎస్సార్సీపీకీ ఎలాంటి సంబంధం లేదు. అయినా చివరికి ఏపీ పోలీస్ స్టేషన్లన్నింటిలో టీడీపీ నాయకులతో జగన్మీద, సాక్షి మీద కేసులు పెట్టించే దుర్మార్గానికి తెగించాడు. 
  • పట్టిసీమలో వందల కోట్లు ఎలా కొల్లగొట్టారు, జీవో నెంబర్ 22 ద్వారా జలయజ్ఞం స్కీమ్ను ధనయజ్ఞంగా ఎలా మార్చుకున్నారు, జీవో నెంబర్ 163 ద్వారా బెరైటీస్లో తన వారికి మరో 5 శాతం లాభం చేకూర్చేలా ఎలా వ్యవహరించారు, పారిశ్రామికవేత్తలకు వారు అడగకుండానే రూ. 2067 కోట్లు ఏరంకంగా వారి జేబులో పెట్టారు-అందులో కొందరి నుంచి చినబాబుకు 30 శాతం అవినీతి సొమ్ము ఎలా అందింది, ప్రత్యేకించి నాలుగు డిస్ట్రలరీలకు మద్యం ఉత్పత్తి పెంచేందుకు జీవో నెంబరు 369 ఎలా జారీ చేశారు, గ్రామగ్రామాన ఇసుక మాఫియాను ఎలా ప్రోత్సహించారు, స్విస్ ఛాలెంజ్ పేరిట విజయవాడ-గుంటూరు మధ్య భూముల్ని సింగపూర్కు ఎలా సంతర్పణ చేస్తున్నారు, గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్టులకు సామర్ధ్యం రెట్టింపు చేసి దానిపై వ్యాట్ ఇవ్వటం ద్వారా రాగల రెండేళ్ళలోనే రూ. 2300 కోట్లు ఎలా దోచిపెట్టబోతున్నారు, అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర దాదాపు సగం తగ్గినా అత్యధిక ధరల ప్రాతిపదికన బొగ్గును విద్యుత్ సంస్థలకు అమ్మేందుకు కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారు... ఇలాంటి అధికార దుర్వినియోగం ద్వారా రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టారు, ఆ సొమ్మును పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు నుంచి వ్యవస్థలను మేనేజ్ చేయటం వరకు వివిధ అంశాల మీద ఎలా ఖర్చు పెడుతున్నారు అన్నది రేవంత్రెడ్డి వ్యవహారంతో, చంద్రబాబు నాయుడు సంభాషణల టేపులతో బట్టబయలైంది. 
Back to Top