గోదావరిని ఏడారిగా మార్చిన ఘనుడు

పశ్చిమగోదావరిః
ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో
వైఎస్సార్సీపీ రైతు సదస్సు నిర్వహించింది. ఈసదస్సుకు వైఎస్సార్సీపీ నేతలతో
పాటు రైతులు, ఇతర పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గోదావరి డెల్టా
ఎండిపోవడానికి కారణం చంద్రబాబేనని ఈసందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు
మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన గోదావరి ప్రజలను మోసం
చేసిన ఘనత చంద్రబాబుదేనని  దుయ్యబట్టారు. 

పట్టిసీమ వల్ల గోదావరి డెల్టా ఎడారిగా మారుతుందని తమ అధ్యక్షులు వైఎస్ జగన్ చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదని నేతలు వాపోయారు. గోదావరి
జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు జరగడం బాధాకరమని...అందుకు  ప్రభుత్వమే
కారణమని నేతలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే గోదావరి
జిల్లాల్లో నీటిసమస్య ఏర్పడిందన్నారు. రైతు సదస్సులో వైఎస్సార్సీపీ నేతలు
కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకాశేషుబాబు, పార్టీ రైతు
విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top