అధికారుల్ని భ‌య పెడుతున్న‌ది ఎవ‌రు..

రాష్ట్రంలోని
13 జిల్లాల ఉన్న‌తాధికారులు హైదరాబాద్ పెద్దల పేరు చెబితే హ‌డ‌లి
పోతున్నారు. కొత్త కొత్త ఆలోచ‌న‌ల పేరు చెప్పి త‌మతో ఆడుకొంటున్నార‌ని
లోలోప‌ల కుమిలిపోతున్నారు.

ముఖ్యమంత్రి గా
చంద్ర‌బాబు నాయుడు అధికారం చేప‌ట్టిన నాటి నుంచి ప‌ర్య‌ట‌న‌ల మీద ఎక్కువ‌గా
మోజు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో అడ్డంగా
దొరికిపోయాక ఆయ‌న హైద‌రాబాద్ లో ఉండేందుకు ఇష్ట ప‌డ‌టం లేదు. ఒక ర‌కంగా
చెప్పాలంటే హైద‌రాబాద్ ను చూసి భ‌య ప‌డుతున్నారు. దీంతో జిల్లాల్లోనే
ఎక్కువ‌గా గడుపుతున్నారు. విజ‌య‌వాడ‌లో కార్య‌క‌లాపాలు
నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ అక్క‌డికి ఇంకా ప‌రిపాల‌న యంత్రాంగం త‌ర‌లి
రాలేదు. దీంతో ఫ్రీగా ప్రచారం కొట్టేయాలంటే చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల మీద
ఆసక్తి చూపుతున్నారు. కానీ, చంద్ర‌బాబు త‌ర‌లి వ‌స్తున్నారంటే ఆయ‌న‌కు,
ఆయ‌న మంది మాగాధుల‌కు ఏర్పాట్లు చేయ‌టానికి జిల్లా ఉన్న‌తాధికారులు
ప‌రుగులు తీస్తున్నారు. ఖ‌ర్చు త‌డిసిమోపెడవుతుంటే.. ఆ బిల్లులు క్లియ‌ర్
అయ్యేందుకు వారాలు, నెల‌లు పట్టేస్తోంది. ఈ లోగా మ‌రో ప‌ర్య‌ట‌న వ‌చ్చి
ప‌డుతోంది. 

మీ ఇంటికి మీ భూమి స‌ద‌స్సులు
ఆగ‌స్టులో జ‌రిగాయి. ఒక్కో రెవిన్యూ గ్రామానికి వెయ్యి రూపాయిలు ఇస్తార‌ని
ఆర్బాటంగా ప్ర‌క‌టించారు. 1-బి న‌క‌ళ్లు త‌యారు చేయించాల‌ని ఆదేశాలు జారీ
చేశారు. అధికారులు ఏదో తంటాలు ప‌డి సద‌స్సులు నిర్వ‌హించినా చాలా చోట్ల
నిధులు విడుద‌ల కాలేదు. దీంతో కింది స్థాయి రెవిన్యూ అదికారులు కుయ్యో
మొర్రో అంటున్నారు. 

పట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం
సంద‌ర్శ‌న కోసం భారీగా రైతుల్ని పంపించాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు హడావుడి
చేశారు. జిల్లాల్లో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల్ని పెద్ద ఎత్తున
పంపించారు. ప్ర‌తీ జిల్లాలో ల‌క్ష‌ల రూపాయిల చేతి చ‌మురు వ‌దిలింది.
మొత్తంగా కోట్ల రూపాయిలు ఖ‌ర్చ‌యింది.
అమ‌రావ‌తి శంకుస్థాప‌న
కోసం ప్ర‌తీ గ్రామం నుంచి మ‌ట్టి, నీరు పంపించాల‌ని నిర్ణ‌యించారు.
ఇందుకోసం గ్రామాల్లో వేల‌కు వేలు ఖ‌ర్చ‌యింది. ఇదంతా ఖ‌జానా నుంచి విడుద‌ల
అవుతుంద‌ని చెప్పారు. కానీ అటువంటి ఉత్త‌ర్వులు మాత్రం విడుద‌ల కాలేద‌ని
లెక్కతేలింది.

ఇన్ని ర‌కాల ప్ర‌చారపు ఆర్భాటాల‌కు
కోట్ల రూపాయిలు ఖ‌ర్చు అవుతుంటే, వెంట‌నే నిధులు విడుద‌ల కావ‌టం లేదు.
దీంతో జిల్లా స్థాయి అధికారులు హ‌డ‌లిపోతున్నారు. మొత్తం మీద టీడీపీ
నాయ‌కుల ప్ర‌చార‌పు ఆర్భాటానికి ఉన్న‌తాధికారులు కంగారు ప‌డుతున్నారు. 
Back to Top