ప్రజా కురుక్షేత్రంలో బాబు కొట్టుకుపోవ‌డం ఖాయం

కోవూరు(నెల్లూరు):  రాష్ట్రంలో జరుగుతున్న చంద్రబాబు ఆరాచకపాలన ఈ నాటిది కాదని ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చంద్రబాబుకు ప్రజల్ని వంచించడం చంద్రబాబుకే చెల్లుతుందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డిప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరు మండలం రుక్మిణి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన విలేక‌రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన నంద్యాల బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  చంద్రబాబునాయుడు గురించి ఏ విధమైన పొరపాట్లు మాట్లాడలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను వంచించినందుకు ప్రజాక్షేత్రంలో ప్రజలే కాల్చి చంపిన పరవాలేదన్నారు. ప్రజల తరఫున మాట్లాడారన్నారు. చంద్రబాబునాయుడ్ని ఎన్నిసార్లు ఉరి తీసిన పాపం పోలేదన్నారు. చంద్రబాబుకు, వాళ్ళ చెంచాలకు ఉలికిపాటు ఎందుకో ప్రజలు చెప్పాలన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రజా సమస్యలను గాలికి వదిలివేసి తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబం పైన అవాకులు, చ‌వాకులు  పేలడం తప్ప ఏ ఒక్క సమస్య తీర్చిన పాపానాపోలేదన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలిన నాయకులను ప్రజలే ఏ విధంగా మట్టికరపించారన్న విషయాలను గుర్తు చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 

Back to Top