కాపుల ఓట్లు కాజేసే కుట్ర

  • నంద్యాల, కాకినాడ ఎన్నికల నేపథ్యంలో బాబు కుట్రలు
  • కాపుల ఓట్లు కాజేయాలన్న దుర్భుద్ధితోనే కాపు సమావేశం 
  • టీడీపీ కాపులను సమావేశపర్చి డబ్బా కొట్టుకునే కార్యక్రమం
  • కాపులను బీసీల్లో చేర్చే అంశంపై బాబుకు చిత్తశుద్ధి లేదు
  • మంజునాథ కమిషన్ రిపోర్ట్ ఇంత కాలం ఎందుకు ఆలస్యమైంది
  • బాబు కపట నాటకాన్ని కాపులు, బలిజలు తిప్పికొట్టాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
కర్నూలుః కాపుల ఓట్లు కాజేయాలన్న దుర్భుద్ధితోనే చంద్రబాబు కాపు సమావేశం ఏర్పాటు చేశారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కాపులు అత్యధికంగా ఉన్న నంద్యాల, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికలు జరుగుతున్నందునే కాపులను మోసగించేందుకు మరోసారి కుట్రలు పన్నుతున్నాడని అంబటి ఫైర్ అయ్యారు. బాబు కపట నాటకాన్ని తిప్పికొట్టేందుకు కాపులంతా సిద్ధంగా ఉండాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ నాయకులతో విజయవాడలో కాపుల మీటింగ్ ఏర్పాటు చేసి...బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని బాబు చెప్పడం బూటకమన్నారు. మంజునాథ కమిటీ సిఫార్సులు వచ్చాక వాటిని కేంద్రానికి పంపిస్తామని చెబుతున్న చంద్రబాబు...ఇంతకాలంగా రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఎందుకు ఆలస్యమయ్యిందని నిలదీశారు. బీసీలకు సంబంధించిన అంశాలపై స్టడీ చేసేందుకు మాత్రమే కమిషన్ వేశారని మంజునాథ చెబుతుంటే...చంద్రబాబు మాత్రం కాపులను బీసీల్లో చేర్చేందుకే మంజునాథ కమిషన్ వేశామని చెెబుతున్నారన్నారు. ఇద్దరూ రెండు విధాలుగా చెబుతున్నదాన్ని బట్టి చూస్తుంటేనే బాబుకు కాపులపై ఏపాటి ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. 

నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపులు కీలకంగా ఉన్నారు కాబట్టే....కాపులను బీసీల్లో చేర్చుతున్నామన్న భ్రమను కలిగించి బలిజలు, కాపుల్ని మోసం చేసి ఓట్లు వేయించుకోవాలన్న దుర్బుద్దితో బాబు ఉన్నారన్నారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి బాబుకు చిత్తశుద్ధి లేదని అంబటి ఫైర్ అయ్యారు. కాపులను బీసీల్లో చేర్చాలని అహర్నిషలు కష్టపడుతున్నది ముద్రగడ పద్మనాభం అని అంబటి అన్నారు. అందుకోసం ముద్రగడ పాదయాత్రకు వస్తుంటే 18రోజులుగా గేటు దగ్గర ఆపేసి లోపలికి పంపిస్తున్నారన్నారు.  కాపులను బీసీల్లో చేర్చుతున్నామని చెబుతున్న బాబు ముద్రగడతో ఎందుకు చర్చలు జరపడం లేదని అంబటి ప్రశ్నించారు.  బాబు మాటలను ముద్రగడ నమ్మరు కాబట్టే టీడీపీ కాపులతో సమావేశం పెట్టి సొంత డబ్బా కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారని అర్థమవుతోంద్నారు.   మంజునాథ కమిషన్ వేసినా, కాపు కార్పొరేషన్ బాబు చిత్తశుద్ధితో వేయలేదన్నారు. ముద్రగడ పద్మనాభం తునిలో కాపు గర్జనకు పిలుపునిచ్చేవరకు కాపు కార్పొరేషన్ , కమిషన్ గురించి బాబు మాట్లాడలేదన్నారు. తుని సమావేశం తర్వాతే ఈరెండు అంశాలు తెరపైకి వచ్చాయన్నారు. 

ముద్రగడ కుటుంబాన్ని భౌతికంగా వేధించి, ఉద్యమంలో పాల్గొన్న కాపు యువకులపై రౌడీ షీట్ లు తెరిచి నిర్బంధించి ఈరోజు కాపులకు చేస్తున్నామంటే బాబు మాటలను నమ్మేవారు ఎవరూ లేరని అంబటి అన్నారు.  కాపుల ఓట్లు కాజేయాలన్న చంద్రబాబు దుర్భుద్ధిని బలిజలు, కాపులు అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి ట్రిక్కులు బాబుకు కొత్తేమీ కాదని,  అవసరమైనప్పుడు మాత్రమే కాపులను మోసం చేసే పనిలో ఉన్నాడని కాపులు గమనించాలన్నారు. ఓవైపు, ముద్రగడను వేధిస్తూ మరోవైపు, బాబు కాపులను మోసం చేసే కార్యక్రమం చేయడాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని అంబటి అన్నారు. నేను అదికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లో కాపులను బీసీల్లో చేర్చుతానని చెప్పిన బాబు...ఆరు ఆరుమాసాలు పోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదని స్పష్టం చేశారు. కాపులకు ఐదేళ్లలో ఐదువేల కోట్లు ఖర్చుచేస్తామన్న బాబు మూడేళ్లలో మూడు వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ. 300కూడ ఖర్చుచేయలేదన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top