చంద్రబాబు బ్రహ్మణ ద్వేషి

నంద్యాలవిద్య: చంద్రబాబునాయుడు స్వతహాగా బ్రాహ్మణ ద్వేషి అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్  సీనియర్‌ నాయకుడు చెరుకుచెర్ల రఘురామయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆనందసూర్య, బ్రాహ్మణులను మభ్యపెడుతూ వాగ్దానాలు చేస్తూ తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారన్నారు. ఒక్క బ్రాహ్మణుడికి కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌ టికెట్‌ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా విశేష సేవలు అందిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి బ్రాహ్మణులకు, అర్చకులకు ధూప,దీప నైవేద్య స్కీంల ద్వారా పేద బ్రాహ్మణులకు సాయం అందించారని చెప్పారు. వీరి స్ఫూర్తితో నంద్యాల వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి స్థానిక వైఎస్సార్‌నగర్‌లో బ్రాహ్మణులకు గృహాలు మంజూరు చేయించి సహకారం అందించారని తెలిపారు. శిల్పామోహన్‌రెడ్డికి బ్రాహ్మణులు మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Back to Top