చంచల్‌గూడ జైలు వద్ద ఘనంగా వేడుకలు

హైదరాబాద్, 21 డిసెంబర్ 2012:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చంచల్‌గూడ జైలు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ,  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రలు, కుతంత్రాల వల్ల శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులు పెట్టారన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేయాలని ఆ రెండు పార్టీలు చూశాయని, కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరింత చేరువయ్యారని అన్నారు.

Back to Top