మూడు సంవత్సరాల కాలంలో టీడీపీ చేసింది శూన్యం
–వైయస్సార్‌సీపీ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి
జమ్మలమడుగు: రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు చేసింది శూన్యమని వైయస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జూన్ 2వ తేదిన జరిగే నియోజకవర్గ ప్లీనరి సమావేశం గురించి నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ....రాష్ట్ర విభజన తర్వాత నియోజకర్గంలోనే కాకుండ జిల్లాలోఎటువంటి పరిశ్రమ కూడ రాలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న స్టీల్‌ఫ్లాంట్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని హామి ఉన్నా ఇంత వరకు ఒక ఇటుక కూడ పడలేదన్నారు. నాడు దివంగతనేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లా లోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో స్టీల్‌ఫ్లాంట్‌కు శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఎస్‌ఆర్‌బీసీ కాలువ పనులు, గాలేరు–నగరి వదర కాలువ పనులు విషయంలో టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడం జరుగుతుందన్నారు. జిల్లాతోపాటు, జమ్మలమడుగు నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అవుతుందన్నారు.
గతంలో పదిసంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లాకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కేవలం గండికోట ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి వెళ్లారే తప్ప ఒక్కరూపాయల నిధులు కూడ పనులకోసం ఖర్చుపెట్టలేదు. అయితే జిల్లా వాసి అయిన వైయస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే గండికోట ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి గాలేరు–నగరి వరద కాలువ పనులు కూడ 90శాతం పూర్తిచేశారు. 2014 నుంచి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోనికి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడ పూర్తిచేయలేదన్నారు. నియోజకవర్గంలో ఎస్‌ఆర్‌బీసీ పనులు పూర్తికావడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆయన విమర్శించారు. జిల్లా ,నియోజకర్గంలోని ప్రజల ,నిరుద్యోగుల సమస్య తీరాలంటే వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిఅయితేనే సాధ్యం అవుతుందన్నారు. జూన్ 2వతేదినజరిగే నియోజకవర్గ ప్లీనరి సమావేశం పట్టణంలోని అలంకార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదేరోజు నూతన పార్టీ కార్యాలయం కూడ ప్రారంభికార్యక్రమం ఉంటుందన్నారు. కావున నియోజకవర్గంలోనికార్యకర్తలు,నాయకులు హజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసమావేశానికి వైఎస్ వివేకానందరెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ ఆవినాష్‌రెడ్డి, అకేపాటి అమరనాథరెడ్డితోపాటు,ఎమ్మెల్యేలు హజరవుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, జిల్లాప్రధాన కార్యదర్శి ధన్నవాడ మహేశ్వరరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివగుర్విరెడ్డి తదితరులుపాల్గొన్నారు