మేం చెప్పిందే కాగ్ లెక్కతేల్చింది..!


() చంద్రబాబు పాలనలోని తప్పిదాల్నే ఎత్తి చూపాం

() అవే వివరాల్ని కాగ్ స్పష్టంగా చెప్పింది

() కాగ్ నివేదికను విశ్లేషించిన వైఎస్ జగన్

హైదరాబాద్) చంద్రబాబు ప్రభుత్వ పనితీరు గురించి వైఎస్సార్సీపీ చెప్పిన వివరాలు
అక్షర సత్యాలని కాగ్ నివేదిక తేటతెల్లం చేసిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
చెప్పారు. శాసనసభకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో వైఎస్ జగన్ కాగ్ రిపోర్టు ను
విశ్లేషించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన కాగ్ మీద మాట్లాడారు.

బాబు నిర్వాకం ఇదే

ఎనిమిది సంవత్సరాలుగా మిగులుగా ఉన్న ఆర్థిక పరిస్థితి, చంద్రబాబు పాలనలో
మాత్రం లోటు గా మారింది. దాదాపు 24,194 కోట్ల రూపాయిల లోటు కనిపించిందని వైఎస్
జగన్ కాగ్ నివేదికను ఉటంకిస్తూ చెప్పారు. మూడు శాతం దాటి జీఎస్డీపీ లో అప్పులు
చేయటానికి లేదని, 6.10 శాతం చేసినట్లుగా కాగ్ నివేదికతో తేలింది. జీఎస్డీపీ లో  పరిధి 27.60శాతం మించకూడదని, కానీ ఇది కాస్తా
32.03 శాతానికి చేరిందని చెప్పారు. చంద్రబాబు తప్పులను కాగ్ ఎండగట్టిందనటానికి ఇది
నిదర్శనం అని వైఎస్ జగన్ చెప్పారు.

సంక్షేమ పథకాలకు కోత

 ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పూర్తిగా
అమలు చేయటం లేదు. ప్రణాళికా వ్యయం 26, 673 కోట్లు అయితే ఎస్సీలకు జనాభా ప్రకారం
4,779 కోట్లు రావాల్సి ఉంటుంది. కానీ 1,504 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 31
శాతం ఖర్చు పెట్టి, 69శాతం ఖర్చు పెట్టనే లేదు. ఎస్టీలకు 1,886 కోట్లు రావాల్సి
ఉండగా రూ. 1,126 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 60శాతం ఖర్చు పెట్టి, 40శాతం ఖర్చు
పెట్టనేలేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం
అంబేద్కర్ విగ్రహం పెడతాను అని చెబుతున్నారని వివరించారు.  దానికి గాను బాబుకి అసలు నైతిక అర్హత లేనే
లేదని స్పష్టం చేశారు.

జనం నెత్తిన అప్పుల భారం

ప్రజల మీద అప్పుల భారం పడుతోంది అని చెప్పటానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయని
వైఎస్ జగన్ పేర్కొన్నారు.  రాష్ట్ర విభజన నాటికి
ప్రజల నెత్తిన 97, 123 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఇధి కేంద్ర ప్రభుత్వం లెక్క
కట్టింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పుస్తకం చూస్తే ఈ ఆర్థిక
సంవత్సరంలో అప్పులు 1,90,153 కోట్లకు చేరినట్లు చెప్పారు. అంటే మూడేళ్లలో అదనంగా
93, 389 కోట్ల మేర అప్పులు చేశారు. దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం
అర్థం అవుతోందని వైఎస్ జగన్ వివరించారు. 

డాష్ బోర్డు మాయాజాలం

టెక్నాలజీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోంది అనటానికి కోర్ డాష్
బోర్డు లెక్కలే ఉదాహరణ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మార్చి 11 న డాష్ బోర్డ్
నుంచి ప్రింట్ అవుట్ తీస్తే వార్షిక వ్యయం రూ. 68, 104 కోట్లుగా చూపించారని, దీని
మీద తాము ప్రశ్నిస్తే అంకెలు మారిపోయాయన్నారు. ఈ నెల 31న ప్రింట్ అవుట్ తీస్తే
1,03,046 కోట్లు చూపించారని పేర్కొన్నారు. అంకెలు, లెక్కల్ని ఈ రకంగా
మార్చేస్తుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని నిలదీశారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం
జరుగుతోందో అర్థం కావటం లేదన్నారు.

      పబ్లిక్ డిపాజిట్స్ వాడుకోవటంలో
పరిమితిని దాటి ఉపయోగిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. మూడు శాతం
మించి తీసుకోవటం తప్పని తెలిసినా, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నుంచి అత్తగారి
సొమ్ము అయినట్లుగా తీసేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top