బుధవారం నాటి షర్మిల యాత్ర 14.3 కి.మీ

రాజమండ్రి, 04 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం నాడు 170వ రోజుకు చేరుకుంటుంది. సెయింట్ పాల్ చర్చినుంచి ఆమె పాదయాత్రను ప్రారంభిస్తారు. బుధవారం నాడు ఆమె 14.3 కిలోమీటర్లు నడుస్తారు. ఆజాద్ చౌక్, నందం గనిరాజు సెంటర్, కంబాల చెరువు, వివేకానంద చౌక్, రాజా థియేటర్, క్వారీ మార్కెట్ సెంటర్ మీదుగా శానిటోరియంకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామానంతరం కొంతమూరు, కోలమూరు, గాడాల మీదుగా మధురపూడి చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు.

Back to Top