విజయనగరంలో జిల్లాలో భారీగా చేరికలు
విజయనగరం: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై పలువురు వైయస్‌ఆర్‌సీపీకి ఆకర్శితులవుతున్నారు. వైయస్‌ఆర్‌సీపీలో భారీగా చేరికలు మొదలయ్యాయి. వైయస్‌ జగన్‌ సమక్షంలో బీజేపీ నేత ముద్దాడ మధు, మహిళా మోర్చా నాయకురాలు రమణి, 200 మంది బీజేపీ కార్యకర్తలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనత అన్నారు. వైయస్‌ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ అపూర్వమని తెలిపారు. నాలుగేళ్లుగా జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. 

మండుటెండ‌ను సైతం లెక్క చేయ‌కుండా..
పల్లెలు పరవశించాయి. తమ అభిమాన జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చూసి మురిసిపోయాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేపడుతున్న రాజన్న తనయునికి ఆప్యాయంగా హారతులతో ఘన స్వాగతం పలికాయి. జై జగన్‌ అంటూ జగన్‌ నినాదంతో మార్మోగాయి. ‘సంక్షేమం అంటే ఎలా ఉంటుందో నీ తండ్రి పాలనలో చూశాం. ఇప్పుడు అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయాం. పేదోళ్లకు పింఛను ఇవ్వాలన్నా... పక్కా ఇళ్లు పొందాలన్నా... వాళ్ల మెప్పు పొందాలట. లేకుంటే లంచాలు ఇవ్వాలట. ఇదేమి విపరీతం అన్నా’ అంటూ తమ గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను మనసువిప్పి చెప్పుకుని ఊరట పొందారు. కాంట్రాక్ట్ కార్మికులు, జూట్‌ మిల్లు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు సోమ‌వారం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు.  కార్మికుల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. ఇవాళ సాయంత్రం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం పట్టణంలోని మూడు లాంత‌ర్ల సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top