భవిష్యత్తు వైయస్‌ఆర్ సీపీదే : రవిబాబు

గజపతినగరం:

భవిష్యత్ వైయస్‌ఆర్‌ సీపీదే అని ఆ పార్టీ జిల్లా పరిశీలకులు కుంభా రవిబాబు అన్నారు. స్థానిక మార్కెట్ యార్డు సమీపాన జిల్లా పార్టీ కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అధ్యక్షతన గజపతినగరం నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా రవి బాబు మాట్లాడుతూ కాంగ్రెసే రాష్ట్రాన్ని హీనస్థితికి దిగజార్చిందన్నారు. రాష్ట్రంలో 26 లక్షల మంది ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారంటే అది వైయస్‌ఆర్ చలువేనని అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు విసుగెత్తిన ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీని గెలిపిస్తారన్నారు. 2014 నాటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.  జిల్లాలో రానున్న ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాల్లోను తమ పార్టీ గెలిచి తీరుతుందని జోస్యం చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావుపై పోటీ చేసి గెలవాలని పీసీసీ అధ్యక్షడు బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు. గురువుకు వెన్నుపోటు పొడిచిన రాజకీయ ద్రోహి బొత్స సత్యనారాయణ అన్నారు. సాంబశివరాజు మాట్లాడుతూ అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లడానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. డాక్టర్ శీరంరెడ్డి పెద్దినాయుడు,  కడుబండి శ్రీనివాసరావు,  బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు, మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గురానఅయ్యలు, ఆదాడ మోహనరావు, కాకర్లపూడిశ్రీనివాస్, వెంకటరమణ, సింగ్‌బాబు, రెడ్డి శకుంతల, శారదానాయుడు, మిత్తిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వైయస్‌ఆర్‌ సీపీలో 230 కుటుంబాల చేరిక

శృంగవరపుకోట: రేవళ్లపాలెం గ్రామానికి చెందిన 230 కుటుంబాలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.  ఆ పార్టీ నాయకుడు బోకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా బోకం శ్రీని వాస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐ ఇలా ఎవరెన్ని కుట్రలు పన్నినా తుది విజయం జగన్‌మోహన్‌రెడ్డిదేనని బోకం శ్రీనివాస్ చెప్పారు. రేవళ్లపాలెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు మిలాఖత్ అయ్యాయని ప్రజలు గమనించారన్నారు. అంతకుముందు పార్టీ జెండాను బోకం శ్రీనివాస్ ఆవిష్కరించారు.

పాచిపెంట: బొబ్బిలి వలస, సీతంపేట గిరిజన గ్రామాల కు చెందిన 60 కుటుంబాలు వైఎస్‌ఆర్ సీపీలో సోమవా రం చేరాయి. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు బోనెల అప్పారావు, దండి ఈశ్వరరావు, శనాపతి కిశోర్, పాడి వేణుగోపాలరావు, పాడి చిరంజీవి,ఆడ్డూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భం గా అప్పారావు మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డికి గిరి జనులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పా రు. వైఎస్‌ఆర్ కుటుంబం చివరి రక్తం బొట్టు వరకూ ప్రజాసంక్షేమం కోసం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యా గ్రామాలకు చెందిన కోన లచ్చయ్య, సంగిరెడ్డి రాము, బడిజన్ని పోలిరాజు, చొక్కాపు నారాయణ, జట్ల సోములు, మజ్జి తౌడు, కరణం ఆదినారాయణ, పతేడ లక్ష్మి పాల్గొన్నారు.

Back to Top