<strong>కర్నూలు, 22 నవంబర్ 2012: </strong>వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని నెల్లూరుజిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధీమాగా చెప్పారు. 2013 జూన్‌లో పార్టమెంటుకు, నవంబర్‌లో శాసనసభకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం 222 శాసనసభ, 35 లోక్‌సభా స్థానాల్లో పార్టీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తారని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. భవిష్యత్ రోజులు వైయస్ఆర్ సీపీవే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చక్రం తిప్పుతారని ఆయన పేర్కొన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో గురువారం ఇక్కడ ఆయన పాల్గొన్నారు. ఇకపైన జగన్ మద్దతు ఇచ్చిన వారే దేశ ప్రధానిగా ఉంటారని ఆయన అన్నారు.<br/>కర్నూలు జిల్లాలో షర్మిలమ్మ పాదయాత్రకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా షర్మిలమ్మను ఆశీర్వదిస్తున్నారన్నారు. ఈ అసమర్ధ ప్రభుత్వంపై ప్రజలంతా విసిగిపోయి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ప్రసన్న అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరెడ్డి సువర్ణయుగాన్ని వారంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు తెలంగాణ ప్రజలు కూడా బ్రహ్మరథం పడతారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అందరి మనస్సుల్లోనూ వైయస్ కొలువై ఉన్నారన్నారు. ఆయనను ప్రాంతాల వారీగా చూడరాదన్నారు. రాష్ట్రం అంతటా ఆయన సువర్ణయుగం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.<br/>టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను ఈ రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రమూ నమ్మే పరిస్థితి లేదని ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిందన్నారు. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలను అస్సలు పట్టించుకోలేదని ఆరోపించారు. బిల్‌గేట్సు లాంటి వారికి ఆయన తలను పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు అమ్ముడుపోవాల్సిన అగత్యం ఎమ్మెల్యేలకు లేదన్నారు.<strong/><strong> </strong>