<img src="/filemanager/php/../files/News/ys_viveka1.jpg" style="width:142px;height:150px;margin:5px;float:right">హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై కుట్రపన్నడం వల్లే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జైలు జీవితం గడుపుతున్నారని మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ విడుదలను కాంక్షిస్తూ ఆయన శంషాబాద్‌లోని ధర్మగిరి సాయిమందిరం, మల్లన్న ఆలయం, బాలయేసు చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అంతకుముందు వేళాంగణికాలనీలోని దివంగత వైఎయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మా ట్లాడుతూ జగన్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, మంత్రివర్గ సమష్టి నిర్ణయంతో విడుదల చేసిన జీవోలతో జగన్‌కు సంబంధం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమన్నారు. జగన్ జనంలో ఉంటే తమ అడ్రస్సు గల్లంతవుందనే భయంతోనే కాంగ్రెస్,టీడీపీలు బెయిల్ కూడా రాకుండా కుట్రలు చేస్తున్నాయని,అందులో భాగంగానే టీడీపీ ఎంపీలు చిదంబరాన్ని కలిసి మంతనాలు చేశారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.