ఓటేసిన పాపానికి నట్టేట ముంచుతారా?


బీజేపీ, టీడీపీలను క్షమించేందుకు వీల్లేదు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ఓటేసి అధికారం కల్పించిన పాపానికి ఆంధ్రరాష్ట్ర ప్రజలను చంద్రబాబు, నరేంద్రమోడీ నట్టేట ముంచారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ఇస్తే చాలని చంద్రబాబు చెప్పారని పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని చెప్పారన్నారు. బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రధాని ప్రసంగం విన్నవారందరికీ చంద్రబాబు మోసం అర్థమైందన్నారు. చంద్రబాబు తన అవినీతి కోసం ప్యాకేజీ అంగీకరిస్తే.. తిరుపతి వెంకన్న సాక్షిగా మీరిచ్చిన మాట ఏమైందని ప్రధానిని ప్రశ్నించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాశనం చేశాయని, వీరిని క్షమించడానికి వీల్లేదన్నారు. చంద్రబాబు తమకు చిరకాల మిత్రుడని రాజ్‌నాథ్‌సింగ్‌ చెబుతున్నారని, కేంద్రమంత్రి మాటలు బట్టి ముఖ్యమంత్రి ఏ విధంగా బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారో అర్థం అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 24వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ బంద్‌ రాష్ట్రానికి మేలు జరిగే బంద్‌ అని, బంద్‌ ద్వారా ఇరు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
Back to Top