రాయ‌చోటిలో టీడీపీకి ఎదురుదెబ్బ‌

కౌన్సిల‌ర్ ఉప ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీదే పైచేయి
రాయచోటి రూరల్‌: నియంత‌పోక‌డ‌తో ప‌రిపాల‌న సాగిస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెప్పారు. మేమంతా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీవైపే ఉన్నామంటూ కౌన్సిల‌ర్ ఎన్నిక‌ల్లో టీడీపీకి దెబ్బ రుచిచూపించారు. గ‌త ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజ‌యం సాధించిన కొంద‌రు స‌భ్యులు అధికార పార్టీ ప్ర‌లోభాల‌కు లోబ‌డి టీడీపీలో చేరారు. దీంతో పలువురు ఇచ్చిన పిర్యాధును స్వీకరించిన సంబంధిత అధికారులు పార్టీ ఫిరాయించిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదిన జరిగిన రెండు వార్డుల ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఎన్నికల అధికారి ప్రసాద్‌రాజు ఆధ్వర్యంలో కౌటింగ్‌ నిర్వహించారు. అందులో 4వ వార్డులో 39 ఓట్ల ఆధిక్యంతో వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి ఎస్‌. రేష్మా, 12వ వార్డులో 341ఓట్ల ఆధిక్యంతో ఎస్‌. అయేషాలు విజయం సాధించారు. దీంతో కౌన్సిలర్లుగా గెలుపొందిన అభ్యర్థుల కుటుంబ సభ్యులతో పాటు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ నసీబున్‌ఖానం , కోఆప్షన్‌ సభ్యులు సల్లాఉద్దీన్‌ పలువురు కౌన్సిలర్లతో కలిసి 4వ వార్డులో సంబరాలు చేసుకున్నారు.  12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన అభ్యర్థి అయేషా కుటుంబ సభ్యులు , నాయకులు , కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అందులో బాగంగా మున్సిపాలిటీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున వైయ‌స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కౌన్సిల్‌ సభ్యులు బస్టాండ్, వైయస్సార్‌ సర్కిల్‌ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top