వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్
హైదరాబాద్) సొంత మనుషుల కోసం నిబంధనల్ని అడ్డగోలుగా మార్చేసుకొని, నిధుల్ని విడుదల చేస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. దీనికి పట్టిసీమ టెక్నాలజీ అని పేరు పెట్టుకొంటే మంచిదని ఆయన చమత్కరించారు.

హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరం లేకపోయినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం పవర్ ప్రాజెక్టులు కడుతోందని ఆయన అన్నారు. రాగల రోజుల్లో దేశమంతా మిగులు విద్యుత్ ఉండే పరిస్థితి ఉన్నప్పటికీ అడ్డగోలుగా నిబంధనలు మార్చేసి ప్లాంట్ లు కట్టేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం దాదాపు రూ. 2,500 కోట్ల రూపాయిలు దుర్వినియోగం అవుతోందని పేర్కొన్నారు. బుగ్గన రాజా ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

*ఐదేళ్ల క్రితం చూస్తే రాష్ట్రంలో విద్యుత్ కొరత 10శాతం ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో 3.2 శాతం కొరత ఉంది. ఐదేళ్ల తరువాత ఆ కొరత దేశవ్యాప్తంగా 2.2 శాతం మాత్రమే ఉంది. అంటే చాలా కాలం వరకు చాలినంత విద్యుత్ ఉంటుందని అర్థం అవుతోంది.

* ఏపీలో 15వేల 500 మెగావాట్ల సామర్థ్యం ఉంది. అందులో 10వేల 750 మెగావాట్లు థర్మల్ ఉంది. అందులో బొగ్గుపై 7500 మెగావాట్లు, గ్యాస్‌పై 3200, డీజిల్‌పై 17మెగావాట్లు ఆధారపడ్డాయి.

* జలవిద్యుత్‌కు వస్తే... 1750 మెగావాట్ల, న్యూక్లియర్ విద్యుత్‌కు వస్తే... 120 మెగావాట్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల కు వస్తే 2700 మెగావాట్లు ఆధారపడి ఉంది.

* మొత్తం మీద చూసినట్లయితే దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత బాగా తగ్గినట్లు అర్థం అవుతోంది. సరిపడనంత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నది సగటున చెప్పవచ్చు.

* 30-4-2015లో లోక్‌సభలో చాలా వరకు భారతదేశంలో విద్యుత్ ఎక్కువగానే ఉందని విద్యుత్ మంత్రి అయిన పీయుష్ గోయెల్ తెలిపారు. పవర్ గ్రిడ్ మానిటరింగ్ లో సున్నపై ట్రేడ్ జరుగుతోందనివివరించారు.

* తమిళనాడులో ఒకప్పుడు సుమారు 13 గంటల విద్యుత్ కోత ఉండేది. ప్రస్తుతం 24గంటలు సరఫరా అవుతోంది. దానికి కారణం దాదాపు రెండు భాగాలు బొగ్గుపై ఆధారపడిన థర్మల్ ప్రాజెక్టులు ఉన్నాయి.

* ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు ఒక్కసారిగా సగానికి సగం పడిపోయాయి.

* ఒకప్పుడు దేశంలో ఉత్పత్తి చేసే బొగ్గు సరిపోక, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి బొగ్గు కొనుగోలు చేయడం వల్ల తీవ్ర కొరత ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ప్రపంచంలో అతి తక్కువ దరకు పెట్రోలియం దొరుకుతోంది. అందువల్లే దేశంలో విద్యుత్ కొరత లేకుండా పోయింది. అంతేగానీ ఇది నిన్న, మొన్న కట్టినందువల్ల కొరత లేకుండా పోయిందనడం హస్యస్పదంగా ఉంది. ఇప్పట్లో విద్యుత్ కొరత ఉండదు. అటువంటప్పుడు కొత్తగా విద్యుత్ ప్లాంట్ల అవసరం ఉండనే ఉండదు.

పవర్ ట్రేడింగ్ రేటు

* 12-7-2016లో పగటి పూట తక్కువలో తక్కువగా యూనిట్‌కు రూపాయి 80పైసలు

ఎక్కువలో ఎక్కువగా యూనిట్‌కు రూ. 2.70పైసలు . సాధారణంగా యూనిట్‌కు రూ. 2.17పైసలు ఉన్నది.

* 2016 ఫిబ్రవరిలో ఏపీలో రిక్వైర్‌మెంట్ 4500 మిలియన్ యూనిట్లుంది... సరఫరా కూడా 4500 మిలియన్ యూనిట్లుంది. కొరత సున్న.

* ఉన్నట్టుంటి ఏపీ జెన్‌కో వారు 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్లాంట్లను హడావుడిగా కట్టిస్తున్నారు. వీటి అవసరం ఏమున్నది. ఈ ప్లాంట్ల విషయంలో అవక తవకలు ఉన్నాయి. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టులో ఒక్కొ మెగావాట్ కోసం రూ. 6.3కోట్లు అవుతుంది. విజయవాడలో డాక్టర్ నార్ల తాతారావు పవర్ స్టేషన్‌లో ఒక్కొ మెగావాట్‌కు రూ. 5.85కోట్లు అవుతుంది

* అదే తెలంగాణలో ఇవే థర్మల్ ప్రాజెక్టులకు తక్కువ రేటు పడుతోంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు ఒక్కొ మెగావాట్‌కు రూ. 4.76 కోట్లు అవుతోంది. యాదాద్రిలోని 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుకు ఒక్కొ మెగావాట్‌కు రూ.4.48 కోట్లు అవుతుంది

* గుజరాత్‌లో వనక్‌బోరి థర్మల్ పవర్ ప్రాజెక్టులో రూ. 4.36 కోట్లు అవుతుంది. మధ్యప్రదేశ్ బరేతిలో రూ. 3.94 కోట్లు అవుతుంది

* దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక్కో మెగావాట్ ఉత్పత్తి కి రూ. 4 కోట్లు అవుతుంటే... ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6 కోట్లు ఎందుకు..?

* అవసరం లేని పవర్ ప్రాజెక్టులు ఎందుకు... ఇంత హై రేట్ ఎందుకు..?

నిబంధనల ఉల్లంఘన ఇలా

· అసలు పవర్ ప్లాంట్ల అవసరమే లేదు. పోనీ ఇచ్చినారే అంటే ఉత్పత్తి రేటు భారీగా పెంచి మరీ ఎందుకు అప్పగిస్తున్నట్లు.

బీజేఆర్ ఎనర్జీసిస్టమ్ లిమిటెడ్, టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్‌లకు రెండు ప్రాజెక్టు నిర్మాణాల అప్పగించారు. వీటికోసం నిబంధనల్ని అడ్డంగా మార్చేసుకొన్నారు. బీజేఆర్ ఎనర్జీసిస్టమ్ ఇప్పటి వరకు పూర్తిస్థాయి పవర్ ప్లాంట్ ఎక్కడ కట్టలేదు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టిపిసి) కొన్ని విధానాల ప్రకారం ఎన్నో ప్రాజెక్టులకు ఇంప్లిమెంటేషన్ చేసింది . ఆ నిబంధనలు రాష్ట్ర, కేంద్ర విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు అమలు చేస్తుంటాయి. కానీ వీటిని ఆంధ్రప్రదేశ్‌లో పట్టించుకోవటం లేదు.

* ఎన్‌టిపిసి ప్రమాణాల ప్రకారం 500 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ కట్టి ఉండాలి. దానిని సంవత్సరం పాటు నడిపి ఉండాలి.

* ఎన్ టీ పీ సీ చూపించిన ప్రమాణాల్ని ఏపీలో పాటించటం లేదు. వాటిని పక్కన పెట్టేసి ఈ రెండు సంస్థలకు మేలు చేయటం కోసం నిబంధనల్ని అనుకూలంగా మార్చుకొంటున్నారు.

* ఏపీ జెన్స్‌కో వారు చేసిందేమీ లేదు..? కేవలం కొందరి ప్రయోజనాల కోసమే ఇలాంటి అవినీతి. ఎంతో అనుభవం ఎల్ అండ్ టి, రిలయన్స్ పవర్, పుంజులయర్‌లను ఎందుకు పక్కన పెట్టారు

* పట్టిసీమ టెక్నాలజీని అనుసరిస్తున్న బాబు సర్కారు

* అవసరం అయిన సంస్థల కోసం నిబంధనల్ని మార్చేసుకోవటం చంద్రబాబు మార్కు గిమ్మిక్కు. పట్టిసీమ లో అలాగే నిబంధనలు మార్చేసి తమ జేబు సంస్థలకు పనులు అప్పగించారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. దీన్నే పట్టిసీమ టెక్నాలజీ అని చెప్పుకోవాల్సి ఉంటుంది.

* ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఏంటి ఈ అన్యాయం అని వైయస్ జగన్ ప్రశ్నిస్తే మేము ఇంకా టెండర్లు పిలవలేదని అచ్చెన్నాయుడు బుకాయించారు. ఒక కంపెనీకి ఓకే కాకముందు గ్రౌండ్ వర్క్ ఎలా చేస్తారు

* ఉప్పునీళ్ల ట్రిట్‌మెంట్ కోసం రూ. 100 కోట్ల చాలని ఎన్నో కంపెనీలు ఉత్తరాలు రాశారు. మరి దీనికి రూ. 500 కోట్లు ఎందుకు

* సౌరవిద్యుత్ రూ. 4 కే దొరుకుంటే ప్రభుత్వం ఎందుకు రూ. 6 ఖర్చు పెడుతోంది

* నంబర్ 1 అవినీతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి

సరైన పాలన అని పదే పదే చెప్పుకొనే చంద్రబాబుకి ప్రధాని మోడీ సర్వే ప్రకారం 13వ ర్యాంకు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీయార్ కు మొదటి స్థానం వచ్చింది. అదీ తేడా.

* ప్రతిపక్ష పార్టీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అధికార ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

* టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం చిన్నస్థాయి నుంచే అవినీతి జరుగుతోంది

* 80 యేళ్ల ముసలివారు ఫించన్ తీసుకోవాలన్నా జన్మభూమి కమిటీ చెప్పాలిందే

* చివరికి వైన్ షాపుకు లైసెన్స్ విషయంలో సైతం జన్మభూమి కమిటీలదే పైచెయ్యి

* ఇంతమేర అవినీతి, అక్రమాలు జరుగుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు స్పందించడం లేదు.

అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టంగా గణాంకాలతో సహా ప్రభుత్వ అవినీతిని తేటతెల్లం చేశారు.