యూటర్న్ తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడితే చాలుబీజేపీతో కలిసిపోతున్నట్లు పచ్చమీడియాలో బాబు లీకులువైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ఢిల్లీ: సోషల్ మీడియాలో చంద్రబాబు , యూటర్న్ అంకుల్ అనే పేరు సంపాదించుకున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బీజేపీతో కలిసి ఉందాం రా.. కలహమెందుకు అని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు చెప్పినట్లుగా చంద్రబాబు అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా మంచిదేనన్నారు. ఢిల్లీలో లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా విభజన అంశాలు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే.. బీజేపీతో అండస్టాండింగ్‌లో ఉన్నారని చంద్రబాబు, పచ్చ మీడియా కోడై కూసిందని మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గాలు అంతా ఇంతా కాదని, ప్రజలను మభ్యపెట్టేందుకు మీడియాను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని వైయస్‌ఆర్ సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబు బీజేపీతో మళ్లీ కలిసిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, బాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టుపెట్టకుండా వాటిని కాపాడితే చాలన్నారు.
ఎవరు లాలూచీ పడ్డారో తెలిసింది: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
కేంద్ర ప్రభుత్వంతో ఎవరు లాలూచీ అయ్యారో ప్రజలే గమనిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా లీకులు ఇస్తూ పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు. హోదా కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, దీక్షలు, బంద్‌లు చేపట్టిందన్నారు. ఈ రోజు రహదారుల దిగ్బంధం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలంతా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారని, అందుకు బంద్ విజయవంతం నిదర్శనమన్నారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం తీవ్ర అన్యాయం చేశారని, ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా మారిపోయాడన్నారు. హోదా సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. బడ్జెట్ సమావేశాలు ముగింపు రోజు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తామన్నారు.