బాబుకు ద‌మ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాలి


కావ‌లి (నెల్లూరు): తాను నిప్పున‌ని.. ఏ త‌ప్పు చేయ‌న‌ని చెప్పుకునే చంద్ర‌బాబు చేసేవ‌న్నీ కూడా నీతిమాలిన ప‌నులేన‌ని కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. చంద్ర‌బాబుకు ద‌మ్మూ ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి మ‌ళ్లీ ఎన్నిక‌లకు రావాల‌ని స‌వాల్ విసిరారు. సోమ‌వారం స్థానిక పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  రాజకీయ ఆరంగేట్రం నుంచి ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీలో చేరిక, ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడం వరకు కూడా చంద్రబాబు వి అన్నీ అడ్డదారులే అని ఎమ్మెల్యే విమ‌ర్శించారు.  అడ్డదారులను వంట పట్టించుకొన్న చంద్రబాబు 600 రకాల అబద్ధాల హామీలను 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎమ్మెల్యే చెప్పారు.  టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి తమ పార్టీలోకి వస్తానంటే , ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలన్న మొనగాడు తమపార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. అలా తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. నంద్యాలలో ఎన్నికలు జరుగుతుంటే అక్కడే పోలీసులు, అధికారులు, మంత్రులు తిష్టవేయించి చంద్రబాబు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ఉప ఉన్నికలు జరుగుతన్నందునే పలు రకాల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నామని చంద్రబాబు హడావుడి చేసి దొంగప్రేమలు ఒలకపోస్తున్నారని మండిపడ్డారు. . నంద్యాలలో జగన్‌ బహిరంగసభకు ప్రజలు అనూహ్యంగా తరలిరావడంతో జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేలా సత్యహరిశ్ఛ్రందుడు లాగా నక్క విధేయతలు వల్లివేస్తున్నారని అన్నారు. 
Back to Top