వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ..వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతిః సీఎం చంద్రబాబు నిరుద్యోగుల వ్యతిరేకి అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు చాలా నష్టోయారన్నారు.యువతకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు.నాలుగేళ్లైనా ఇప్పటివరుకు డీఎస్సీ నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ హయాంలో వేల మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయన్నారు. 25వేల మందికి పోలీసు శాఖలో ఉపాధి కల్పించారన్నారు.నిరుద్యోగ సమస్య తీర్చిన ఘనత వైయస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నిరుద్యోగులకు వైయస్ జగన్ హామీ ఇచ్చారన్నారు.వైయస్ జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అని అన్నారు.అందుకే అన్నివర్గాల ప్రజలు వైయస్ జగన్‌కు అండగా నిలుస్తున్నాయన్నారు.