మోసానికి మారుపేరు చంద్రబాబు


నిరుద్యోగులు ఒక్కొక్కరికి రూ. 1.08 లక్షలు చంద్రబాబు బాకీ
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది
వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా

కాకినాడ: వంచనకు మారుపేరు ఎవరని స్కూల్‌ పిల్లాడిని అడిగినా చంద్రబాబు ఫొటో చూపిస్తాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచి రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను వంచాడన్నారు. గడిచిన ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, నిరుపేదలకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, హోదా 15 ఏళ్లు సాధిస్తామని 650 హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కేవలం దొరికి మేరకు దోచుకోవడమే ఎజెండాగా పెట్టుకొని పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న కొన్ని వేల మందిని విధుల నుంచి తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని వ్యక్తి, రాష్ట్ర ప్రజలంతా పప్పు అని పిలుచుకునే లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం వచ్చిందన్నారు. 

గడిచిన నాలుగున్నరేళ్లలో 1.75 కోట్ల ఇళ్లులకు ఒకొక్కరికి రూ. 1.08 లక్షలు చంద్రబాబు బాకీ పడ్డాడన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని కొంత మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని హడావిడి చేస్తున్నాడన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేశారు. హోదా కోసం పోరాటాలు, యువభేరీలు, ఆమరణ దీక్షలు చేశారన్నారు. హోదా వస్తేనే పన్ను రాయితీలు వస్తాయి.. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబితే.. చంద్రబాబు అవహేళన చేస్తూ హోదా సంజీవని కాదని మాట్లాడారని, అంతటితో ఆగకుండా కొన్ని వేలమందిపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అయ్య జాగీరా ఇదేమైనా.. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని ఏపీ హెరిటేజ్‌ కంపెనీ అనుకుంటున్నాడా.. హోదా కంటే ప్యాకేజీ మేలు స్వాగతిస్తున్నామని చెప్పడానికి అని ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి ఏపీని తాకట్టుపెట్టాడు. అందుకే చంద్రబాబును ప్రజలంతా చీకొడుతున్నారు. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు.. విభజన చట్టంలోని అంశాలన్నీ సాధిస్తారనే నమ్మకం అందరిలో ఉందన్నారు. 
Back to Top