బాబుకు డబ్బు పిచ్చి

  • రాయలసీమపై సర్కార్‌ సవతి ప్రేమ
  • పట్టిసీమ నుంచి రాయలసీమకు కెనాల్‌ వేశారా?
  • చిత్రావతిలో నీళ్లున్నా రైతులకు వదలడం లేదు
  • గండికోట, గాలేరు–నగరి పూర్తయితే నీళ్లు వచ్చేవి
  • బాబు మూడేళ్ల పాలనలో ప్రాజెక్టులకు చాలీచాలని కేటాయింపులు
  • టెంకాయలు కొట్టిపోవడం తప్ప డబ్బులెప్పుడైనా ఇచ్చారా?
  • మహానేత చేపట్టిన ప్రాజెక్టులను తానే కట్టించినట్లు బాబు ఫోజు
  • రైతులు పడుతున్న అగచాట్లతో ఇప్పటికైనా బాబుకు బుద్ధి రావాలి
  • –పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు మహాధర్నాలో వైయస్ జగన్

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు డబ్బు పిచ్చి తప్ప రైతుల మీద అభిమానం లేదని, రాష్ట్రంలో తలా తోక లేని పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమపై టీడీపీ సర్కార్‌ సవతి ప్రేమ చూపుతుందని, తాగునీరు, సాగునీరు లేక ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ధ్వజమెత్తారు. తాగు, సాగునీటి కోసం వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. పులివెందులలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంది. రైతులు ఎలా బతుకుతున్నారన్న విషయాలు బాబు దృష్టికి పోవాలి. ప్రజలు పడుతున్న అవస్థలు, పంటలు పండని పరిస్థితి, కరువు పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఇవాళ ధర్నా చేపట్టాం. 

చిత్రావతి, శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా రైతులకు వదలని పరిస్థితి నెలకొంది. చిత్రావతి డ్యాం కెపాసిటీ 10 టీఎంసీలు, దీనికి జరిగిన కేటాయింపు కేవలం 3.2 టీఎంసీలు మాత్రమే. ఇందులో మొదటి విడతగా ఆగస్టు 15 నుంచి అక్టోబర్‌ 7 వరకు 1.8 టీఎంసీలు ఎంపీఆర్‌ నుంచి విడుదల చేశారు. చిత్రావతికి చేరిన నీరు 0.67 టీఎంసీలు మాత్రమే. అంటే 63 శాతం లాస్‌. రెండో విడతగా నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 22 వరకు ఎంపీఆర్‌ నుంచి 1.4 టీఎంసీల నీరు వచ్చింది. చిత్రావతికి 0.66 టీఎంసీలు చేరాయి. చిత్రావతిలో ఇవాళ 1.15 టీఎంసీలు ఉన్నాయి. ఇవాళ ధర్నా చేయడానికి ముఖ్యకారణం.. చిత్రవాతి నుంచి సాగునీరు అందించాలంటే డ్రైవింగ్‌ హెడ్‌ కనీసం 0.9 టీఎంసీలు ఉంటేనే సాధ్యం. ఇప్పుడు 1.15 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి కనీసం సాగునీరు అందించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం డిసెంబర్‌ 22 నుంచి చిత్రావతికి నీరు ఇవ్వడం మానేసింది.

డ్రైవింగ్‌హెడ్‌ ఉన్నప్పుడు చిత్రావతికి నీరు పంపించి పులివెందుల స్టోరెజ్‌ ట్యాంకులు, లింగాల చెరువులు నింపుకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ హడావుడిగా నీళ్లు ఇవ్వడం మానేశారు. కదిరి, ధర్మవరం మున్సిపాలిటీలకు కూడా తాగడానికి 44 క్యూసెక్కుల చిత్రావతి నీళ్లు ఇస్తున్నారు. ఆ తర్వాత నీళ్లు ఇచ్చినా డ్రైవింగ్‌ హెడ్‌ పెంచుకోవడానికే సరిపోతుంది. సాగునీరు సాధ్యం కాదు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా..గండికోట కట్టని కారణంగా పులివెందులకు నీళ్లు రావాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కన్న కలలలు నెరవేరకుండా అడ్డుకుంటున్నారు. తుంగభద్ర నీరు ఏవిధంగా సరిపోవడం లేదు, కనీసం కృష్ణా నీరు వచ్చి గండికోట పూర్తయితే 26 టీఎంసీలు అందులో నీరు నిల్వ చేసుకోవచ్చు. గండికోట, గాలేరు–నగరి ప్రాజెక్టులు పూర్తయితే నీళ్లు వచ్చేవి. చిత్రావతి, పైడిపాలెం, వావికొండలు ,మైలవరంకు నీరు ఇవ్వవచ్చు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మహానేత ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే..చంద్రబాబు పాలనలోకి వచ్చిన మూడేళ్లయినా చాలీచాలని కేటాయింపులతో ప్రాజెక్టులు కడుతున్నారు.  

బాబు  తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నికల ముందొచ్చి ప్రాజెక్టుల ముందు టెంకాయలు కొట్టాఏ తప్ప ఏనాడు పైసలు విదల్చలేదు. గాలేరు–నగరి రూ.13 కోట్లు, హంద్రీనీవాకూ రూ.17 కోట్లు ముష్టి వేసినట్లు ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ పాలనలో కరువు సీమను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టులకు రూ.4 వేల కోట్లు కేటాయించి 80 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడానికి కూడా చంద్రబాబు చాలీచాలని కేటాయింపులు చేస్తున్నారు. బాబు ఇవాళ పట్టిసీమకు నీళ్లు అంటారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చావని అడుగుతున్నా. పట్టిసీమ నుంచి ఏమైనా కెనాల్‌ వేశాడా? కారణం ఏంటంటే..పట్టిసీమ ప్రాజెక్ట్‌ను కట్టారు. పట్టిసీమ నుంచి 48 టీఎంసీలు ప్రకాశం బ్యారేజికి వచ్చాయి. శ్రీశైలం నుంచి కిందకు వాడుకోవచ్చని జీవోలు ఎందుకు ఇవ్వలేదు. కేవలం 1300 కోట్లు పెట్టినా కూడా పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. గండికోట ప్రాజెక్టుకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని 22 గ్రామాల ప్రజలు అడుగుతుంటే, చంద్రబాబు సీఎం అయి మూడేళ్లయినా మాటలు చెబుతాడు గానీ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు.  

గండికోటలో 26 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ నీరు నిల్వ చేయాల్సి ఉంది.  ఇప్పటికి గాలేరు– నగరి ప్తూయి ఉంటే శ్రీశైలం నుంచి రోజుకు 22 వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేవి, గండికోట కళకళలాడేది. చిత్రావతి, పైడిపాలెం పూర్తి కెపాసిటి నీళ్లు వచ్చేవి. జిత్తులమారి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే..గొప్పగా నీళ్లు తెస్తున్నామని బిల్డప్‌ ఇవ్వడం ఎందుకని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా?. గండికోటకు 26 టీఎంసీల నీళ్లు తేవాలి. చిత్రావతి, పైడిపాలెంలకు కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించాలి. తుంగభ్రద నుంచి చిత్రావతికి మళ్లీ కేటాయిస్తూ ఆ తర్వాత పీబీసీ, లింగాల బ్రాంచ్‌ కెనాల్‌కు కూడా వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్‌ చేస్తున్నాం.   ఇప్పుడున్న పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. రైతుల దుస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఇక్కడ ధర్నా చేస్తున్నాం. చంద్రబాబుకు రైతుల మీద ఏ  మాత్రం అభిమానం లేదు. 

కేబినెట్‌ సమావేశాల్లో రైతుల భూములు ఎలా లాక్కోవాలి, పెద్దలకు ఎలా ఇవ్వాలనే చూస్తాడు. రైతులకు రుణాలు ఇచ్చిన తీరును చూసి చంద్రబాబు సంతృప్తి చెందారట..అది చూసి ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా అనిపించింది. బ్యాంకులు రైతులకు రూ.24 వేల కోట్ల పంట రుణాలు, 10 వేల కోట్ల టెర్మ్‌ లోన్సక్ష ఇవాల్సి ఉంటే మొత్తం కలిపి కేవలం రూ.4700 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రబీలో 9 లక్షల హెక్టార్లలో కూడా పంటలు వేయకపోయినా..ఆయనకు సంతృప్తికరంగా ఉందట. ఈ మనిషికి ఏం జరుగుతోందన్న అవగాహన లేదు. ఉండేదల్లా డబ్బు..డబ్బు అనే పిచ్చి తప్ప ఏమీ లేదు. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యి, చిత్రావతికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. రైతులు పడుతున్న అగచాట్లతో ఇప్పటికైనా బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా.బాబుకు ఉండేదల్లా డబ్బు..డబ్బు పిచ్చి. ఇప్పటికైనా పులివెందుల రైతులను ఆదుకునేలా చిత్రవతికి నీళ్లు ఇవ్వాలని, ఇప్పటికైనా బాబుకు బుద్ధి వస్తుందని ఆశీస్తున్నా.  
 
Back to Top