బాబుది మాటల ప్రభుత్వం..చేతలు శూన్యం

వైయస్సార్ కడపః చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మండిపడ్డారు. కడపజిల్లాకు నీళ్లు ఇవ్వకుండా చంద్రబాబు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని కలెక్టరేట్ వద్ద జరిగిన రైతు మహాధర్నాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ సీఎం అయితేనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని జిల్లా నేతలు స్పష్టం చేశారు. 

మిథున్ రెడ్డి(రాజంపేట ఎంపీ)
రెయిన్‌గ‌న్‌ల‌తో క‌రువును ఎకిపారేస్తాన‌ని చెబుతున్న  చంద్ర‌బాబు మాట‌ల్లో అస‌త్యం త‌ప్ప స‌త్యం లేద‌ని వైయ‌స్సార్‌సీపీ రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి అన్నారు. రాయ‌ల‌సీమ‌లో తాగ‌డానికి నీళ్లు లేవ‌ని అటువంటి స‌మ‌యంలో రెయిన్‌గ‌న్‌ల‌తో పంటలను కాపాడానని బాబు చెప్పడం శోచనీయమన్నారు. బాబుకు నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే క్రాప్ ఇన్సురెన్స్‌, 2014-15సంబంధించిన  ఇన్‌ఫుట్ స‌బ్సిడీని వెంట‌నే మంజూరు చేయాల‌ని డిమాండ్ చేశారు. రుణ‌మాఫీ కానీ రైతుల‌కు రుణామాఫీ చేయాల‌ని సూచించారు. హంద్రీనీవా, గాలేరు, న‌గరి, పెనుగంగ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే రాయ‌ల‌సీమ అభివృధ్ధి చెందుతుంద‌ని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. 

వైయస్ అవినాష్ రెడ్డి(వైయస్సార్ కడప ఎంపీ)
వైయ‌స్సార్ ఉంటే రాష్ట్రం విడిపోయి ఉండేదీ కాద‌ని, వైయ‌స్సార్ ఉంటే జిల్లాకు ఇంత న‌ష్టం వాటిల్లేది కాదని.... ప్ర‌తి రైతు ప్ర‌తిరోజు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని స్మ‌రించుకుంటార‌ని క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. రాజ‌న్న ఉండి ఉంటే ఏ రైతు కంట నీరు వ‌చ్చేదీ కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైయ‌స్సార్ హ‌యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 11వేల క్యూసెక్క‌ల నుంచి 44 వేల క్యూసెక్కుల‌కు విస్త‌రించార‌న్నారు. రోజుకు 27 గంట‌ల విద్యుత్ అందిస్తున్నాన‌ని పేర్కొన్న వ్య‌క్తి చంద్ర‌బాబు అని... బాబుకు మాత్రమే రోజుకు 24 గంటలు కాకుండా 27 గంటలున్నాయేమోనని అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి(కమలాపురం ఎమ్మెల్యే)
తెలుగు గంగ‌, బ్ర‌హ్మసాగర్ కు 12 టీఎంసీల నీళ్లు ఇస్తామ‌న్న ప్ర‌భుత్వ హామీ ఏమైంద‌ని  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాట‌లు చెప్ప‌డం త‌ప్ప... చేత‌లు లేవన్నారు. కెసీకెనాల్ కింద 90వేల ఎక‌రాల‌కు నీళ్లు ఇస్తామ‌ని గంటా శ్రీ‌నివాస్ చెప్పిన మాట‌లు కేవ‌లం నీటి మూట‌లేన‌న్నారు. ఆయ‌న మాట‌లు నమ్ముకొని పంట‌లు సాగు చేసిన రైతులు న‌ష్ట‌పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంజాద్ బాష(వైయస్సార్ కడప శాసనసభ్యులు)
రాయ‌ల‌సీమ ప్రాంతం, క‌డ‌ప జిల్లాకు జ‌రుగుతున్న అన్యాయాన్ని నిల‌దీసేందుకే ఈ రైతు మ‌హాధ‌ర్నా కార్య‌క్ర‌మ‌మ‌ని క‌డ‌ప శాస‌న‌స‌భ్యులు అంజాద్ బాష అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ప్రాంతాలను సమానంగా చూడడం లేదని, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తోందని  ఆయ‌న మండిప‌డ్డారు. రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి సీఎం హోదాలో ఉండి కూడా ...ఈ ప్రాంతంపై క‌ప‌ట ప్రేమ చూప‌డం ఎంతవ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని  చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. క‌డ‌ప జిల్లాకు ఇస్తాన‌న్న ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పేవ‌ర‌కు పోరాడుతామన్నారు. చంద్ర‌బాబు ఎప్పుడు అబద్దాలే చెబుతారని, ఎప్పుడైతే బాబు నిజాన్ని మాట్లాడ‌తారో అప్పుడు ఆయ‌న త‌ల వెయ్యి ముక్క‌లు అవుతుంద‌ని చెప్పిన దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాట‌ నూటికి నూరుశాతం నిజ‌మ‌న్నారు.  

తాజా వీడియోలు

Back to Top