<strong>దేశం నేతలను ఎక్కడికక్కడ నీలదీయాలని పిలుపు</strong><br/>ప్రత్యేక హోదా సాధనకు సంబంధించిన తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరిపై పలుప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు చెప్పాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను, నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ,ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.<br/>ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడికి వైయస్ ఆర్ కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలివే :<br/>– టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడంలేదు?– వైయస్సార్‌సీపీ ఎంపీలతోపాటు వారు ఎందుకు ఆమర ణదీక్ష చేయడంలేదు?– 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఆమర ణదీక్ష చేస్తే..రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జర గదా?–25 మంది ఎంపీల రాజీనామా, ఆమర ణదీక్ష – దేశవ్యాప్తంగా ప్రకంపనలు తీసుకురాదా? గట్టి సంకేతాలు ఇవ్వదా?–కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చి.. ప్రత్యేక హోదా ఇవ్వరా? కాని టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడంలేదు?–రాజీనామాలకు చంద్రబాబు, ఆయన పార్టీ ఎంపీలు ఎందుకు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు?–లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేస్తే.. అది ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించదా? –రేపు ఉప ఎన్నికలు వచ్చినా.. ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేఅవకాశం రాదా?–ఇది తెలిసీ.. చంద్రబాబు ఎందుకు రాజీనామాలు చేయించడం లేదు?