జయహో బీసీ పేరుతో మరో మోసం..చంద్రబాబు వైఖరీకి నిరసనగా 20న రాష్ట్రవాప్తంగా బీసీల నిరసన..వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి...
విజయవాడః జయహో బీసీ పేరుతో చంద్రబాబు బీసీలను నయవంచన చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. బిసీలపై చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. బీసీల స్థితిగతులు, జీవన ప్రమాణాల స్థాయిపై వైయస్‌ఆర్‌సీపీ పార్టీ బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ద్వారా బీసీ డిక్లరేషన్‌ను చేసిన తర్వాత మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో బీసీల సమావేశాలు ఏర్పాటుచేసి వారికి బహిరంగంగా మాట్లాడే అవకాశాలు కల్పించలేని చంద్రబాబు బీసీలను వంచిస్తూ అన్నివిధాల మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆదరణ–2 పథకం పేరుతో కులవృతుల వారిని నయవంచనకు గురి చేస్తున్నారన్నారు. జయహో బీసీ అంటూ బీసీలను, నారా హమారా అంటూ మైనార్టీలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను బీసీలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు బీసీ ద్రోహి అని, బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. కరివేపాకులా వాడుకుని పక్కనపడేయడం తప్ప వారి అభ్యున్నతికి చంద్రబాబు కృషిచేయలేదని ధ్వజమెత్తారు.
చంద్రబాబు మోసాలను మేధావులు, బీసీ వర్గాలు, ప్రజా సంఘాలు ఏకకంఠంతో నినదిస్తున్నాయన్నారు. సభ్యత్వ కార్యక్రమంలో బీసీలను బెదిరింపుకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీసీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానపరిచిన చంద్రబాబును బీసీలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
బీసీ యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల ఆరునెలలు ఉండగా చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వచ్చారని దుయ్యబట్టారు. బీసీలకు ఏం చేశారని టీడీపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీ ద్వారా టీడీపీ కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. చంద్రబాబు వ్యతిరేక చర్యలను బీసీలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు బీసీ వ్యతిరేక పోకడలు, అన్యాయాలపై బీసీలు ఆలోచించాలన్నారు. చంద్రబాబు బీసీ వ్యతిరేక వైఖరీకి నిరసనగా 20న రాష్ట్రవాప్తంగా అన్ని పార్లమెంటు కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీలంతా పాల్గొని చంద్రబాబు నిజ స్వరూపాలను బయటపెట్టాలన్నారు.పెద్ద ఎత్తున బీసీ శ్రేణులంతా పాల్గొని బీసీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.