నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొమ్మిది సూత్రాల ప్రణాళికను ఆ పార్టీ కార్యకర్తలే నమ్మడం లేదనీ, ఆయన విశ్వసనీయత కోల్పోయిన నేతని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పాదయాత్రలు ఎవరైనా, ఎక్కడైనా చేయవచ్చనీ, దీనిపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదనీ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ అంశం ఢిల్లీ స్థాయిలో తేలాల్సిన అంశమని మేకపాటి వ్యాఖ్యానించారు.