బాబు, కిరణ్ ప్రజలను వంచిస్తున్నారు: విశ్వేశ్వరరెడ్డి

వజ్రకరూరు:

‘వస్తున్నా.. మీకోసం’ అంటూ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఇందిరమ్మ బాట అంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను దారుణంగా వంచిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం వజ్రకరూర్ మండలం పందికుంట, తట్రకల్లు, వజ్రకరూర్ బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొగ్గలోనే తుంచేయాలని కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతున్నాయని.. ఆ క్రమంలోనే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలు పాలు చేశాయని ఆరోపించారు. ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో ప్రపంచంలో ఏ మహిళా చేయని రీతిలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తోన్న షర్మిలకు జనం నీరాజనాలు పలుకుతున్నారన్నారు. గిరిజనుకులకు లక్షలాది ఎకరాలపై యాజమాన్యహక్కులు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిదేనన్నారు.  వైయస్ఆర్‌ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందని.. ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే హంద్రీ-నీవా పథకం కింద 90 వేల ఎకరాలకు నీళ్లందిస్తామని స్పష్టీకరించారు. పాదయాత్రలో జిల్లా ఇన్‌చార్జి దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, సీజీసీ సభ్యులు తోపుదుర్తి కవిత, గిర్రాజు నగేష్, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, తాడిపత్రి, శింగనమల, ధర్మవరం ఇన్‌చార్జ్‌లు వీఆర్ రామిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, తాడిమర్రి చంద్రశేఖరర్‌రెడ్డితోపాటు వై.మధూసూదన్‌రెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల కడపల మోహన్‌రెడ్డి, డాక్టర్ సి.సోమశేఖరరెడ్డి, డాక్టర్ హరికృష్ణ, బోయ సుశీలమ్మ, రంగంపేట గోపాల్‌రెడ్డి, కొర్రపాడు హుసేన్‌పీరా, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, సీపీ వీరన్న, చింతకుంట మధు, మీసాల రంగన్న, శ్రీదేవి, ఉషారాణి, నిర్మల, కసనూరు రఘునాథరెడ్డి, పసుపుల బాలకృష్ణారెడ్డి, యూపీ నాగిరెడ్డి, జేఎం బాషా, బాలనర్సింహారెడ్డి, పూలకుంట శివారెడ్డి, నల్లపరెడ్డి, వలిపిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.

బాబుది కపట ప్రేమ : అధికారంలో ఉన్నపుడు విద్యుత్తు చార్జీలు తగ్గించాలని ఆందోళన చేసిన రైతులపై కాల్పులు జరిపించిన చంద్రబాబు నేడు అధికారం కోసం రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని  కిసాన్‌సెల్ కో ఆర్డినేటర్ వై మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. తట్రకల్లు బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ అధికారం కోసమే చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటున్నారని మండిపడ్డారు.

Back to Top