'బాబు-కిరణ్ మధ్యే‌ అసలు క్విడ్ ప్రో కో'

‌హైదరాబాద్‌: :: ఈ రాష్ట్రంలో క్విడ్‌ ప్రో కో ఏదైనా జరుగుతోందంటే అది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్యే ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద పాలక మండలి సభ్యులు కొణతాల రామకృష్ణ, డి.ఎ. సోమయాజులు అన్నారు. చంద్రబాబునాయుడి హయాంలో ఐఎంజీ భారత సంస్థకు రాష్ట్ర రాజధానిలోని అత్యంత విలువైన భూముల పందేరం చేసిన కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ చేత ఎందుకు దర్యాప్తు చేయించడంలేదని వారు నిలదీశారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. త్వరలో చంద్రబాబుపైనా సీబీఐ దర్యాప్తు జరుగుతుందని ఆర్భాటంగా చెప్పారని, ఆ దర్యాప్తు సంగతి ఏమయిందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుపైన ఈ ప్రభుత్వం సీబీఐ చేత దర్యాప్తు చేయించదన్నారు. అలా చేయిస్తే ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెడతారన్నారు. అవిశ్వాసం పెడితే ఈ ప్రభుత్వం పడిపోతుందన్నారు. ‘అందుకే చంద్రబాబుపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరదు... కిరణ్ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టరు. రాష్ట్రంలో అసలు క్విడ్ ప్రో కో వీళ్లద్దరి మధ్యే ఉంది’ అని ‌వారు ఆరోపించారు.
Back to Top